Thursday, May 16, 2024
- Advertisement -

వైసీపీలోకి మాజీ సీఎం కుమారుడి చేరిక స‌మాప్తం…

- Advertisement -

ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీలోకి భారీగా వ‌స‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇత‌ర పార్టీల సీనియ‌ర్‌నేత‌లు పార్టీలోకి క్యూ క‌డుతున్నారు. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి పార్టీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మాజీ సీఎం నేదుర్‌మ‌ల్లి జనార్దనరెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి జ‌గ‌న్ స‌మ‌క్షంలో లాంఛ‌నంగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినా కాదని రాజీనామా చేశారు. తమ అనుచురులు, సన్నిహితులతో సుదీర్ఘమంతనాలు జరిపిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి డిసైడ్ అయిన‌త సంగ‌తి తెలిసిందే.

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర విశాఖ‌జిల్లాలోకి ప్ర‌వేశిస్తున్న త‌రుణంలో జగన్‌ సమక్షంలో రాంకుమార్‌రెడ్డి వైసీపీలో చేరారు. రాంకుమార్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 1990, డిసెంబర్ 17 నుంచి 1992, అక్టోబర్ 9 వరకు ఏపీ సీఎంగా సేవలందించారు. 1998-99 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పని చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -