- Advertisement -
వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించడానికి భాజాపా యేతర పార్టీల నాయకులు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరు, ప్రస్తుత రాజకీయాలు, జాతీయ స్థాయిలో మహాకూటమి భవిష్యత్ కార్యాచరణపై వివిధ నేతలంతా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, ఎన్సీపీతో సహా పలు యు.పి.ఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు సమావేశమయ్యారు. రాహుల్, శరద్ పవార్, చంద్రబాబు, గులామ్ నబీ ఆజాద్, శరద్ యాదవ్, రాజా, కనిమొళి తదితరులు తదుపరి కార్యాచరణంపై చర్చిస్తున్నారు. సమావేశంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కపక్కనే ఆశీనులయ్యారు.
