Thursday, May 16, 2024
- Advertisement -

కేసీఆర్ ఎటువైపో తేల్చుకోవాలి….చంద్ర‌బాబు

- Advertisement -

తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు చారిత్రక అవసరమని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఖ‌మ్మంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రాహుల్‌గాంధీతో బాబు వేదిక‌ను పంచుకున్నారు.

న్యాయబద్ధంగా రాష్ట్రాన్ని విడదీయాలని చెప్పానని… తెలంగాణకు తాను వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. విభజన హామీలను, ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వలేదని… తెలంగాణలో కూడా ఏ ఒక్క విభజన హామీని నెరవేర్చలేదని అన్నారు. విభజన హామీలపై కేంద్రాన్ని కేసీఆర్ ఒక్కమాట కూడా అడగలేదని విమర్శించారు.

తనకు తెలంగాణ ప్రియమైన ప్రాంతమని మరోసారి స్పష్టం చేసిన చంద్రబాబు…తాను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటానని అన్నారు. తెలంగాణలో తాను పోటీ చేయనని… ఈ ప్రాంతంపై పెత్తనం చేయబోనని చంద్రబాబు తెలిపారు. తాను హైదరాబాదు కట్టలేదని… సైబరాబాద్ ను కట్టింది తానేనని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలనేదే తన ఆకాంక్ష అని… ఏనాడూ తెలంగాణ అభివృద్ధికి తాను అడ్డుపడలేదని అన్నారు.

నాలుగున్నర ఎన్డీయే పాలనతో ఏమైనా ప్రజలకు లాభం వచ్చిందా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. నోట్ల రద్దుతో పాటు ఇంకా ప్రజలు కరెన్సీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. జీఎస్టీని సరిగా అమలు చేయలేదన్నారు.

దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకుంటుందని ఆయన ప్రశ్నించారు. విభజన హామీల్లోని ప్రత్యేక హోదా అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ అడగడం లేదని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ న‌న్ను ప‌దేప‌దే ఎందుకు తిడుతున్నారో అర్థం కావ‌డంలేద‌ని ఆవేద‌న వ్యాక్తం చేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటములు మాత్రమే ఉన్నాయన్న చంద్రబాబు… కేసీఆర్ ఎటు వైపు ఉంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం కోసమే కాంగ్రెస్, టీడీపీ కలిసి పని చేయాలని నిర్ణయించాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -