- Advertisement -

బాబుకు త‌ల‌నొప్పిగా మారిన జ‌మ్మ‌ల‌మ‌డుగు పంచాయితీ..

- Advertisement -

ఒక వైపు సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేల‌…మ‌రో వైపు పార్టీని వీడుతున్న నేత‌లు..ఇంకో వైపు నేత‌ల్లో అసంతృప్తి ఇవ‌న్నీ క‌ల‌సి బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. జ‌గ‌న్ సొంత జిల్లాలో చెక్ పెట్టాల‌ని బాబు ప‌న్నుతున్న వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. ఫిరాయింపు నేత‌ల‌కు, సొంత పార్టీ నేత‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డ వేస్తే భ‌గ్గుమంటోంది. బాబు నేత‌ల మ‌ధ్య ఎన్ని సార్లు పంచాయితీ చేసినా

అస‌లు విష‌యానికి వ‌స్తే…జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క వ‌ర్గం బాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైసీపీనుంచి గెలిచిన ఆది పార్టీ ఫిరాయంచి టీడీపీలో చేరి మంత్రిగా ప‌నిచేస్తున్నారు. పార్టీనే న‌మ్ముకొని ఉన్న రామ‌సుబ్బారెడ్డి మంత్రి ఆది మ‌ధ్య విబేధాలు బ‌య‌ట ప‌డుతూనే ఉన్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య పంచాయితీ చేసిన బాబు రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి విప్‌ను చేశారు. దాంతో కొన్ని రోజులు ఇద్ద‌రు బాగానే ఉన్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో జ‌మ్మ‌ల‌మ‌డుగు టికెట్ విష‌యంలో ఇద్ద‌రు నేత‌లు ప‌ట్టు స‌డ‌లించ‌డంలేదు.

తాజాగా ..జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ తమకే కేటాయించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిచి చంద్రబాబు అమ‌రావ‌తిలో మాట్లాడారు. ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు రాజీఫార్ములా సూచించారు. అయితే దీనిపై ఇద్ద‌రు నేత‌లు విముఖుత వ్య‌క్తం చేశారు.

ఒక వేల జమ్మలమడుగు టికెట్‌ వదులుకుంటే కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తానని, ఒకవేళ ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని తెలియజేసినట్లు సమాచారం. ఈ రాజీ ఫార్ములాను ఇద్ద‌రు నేత‌లు అంగీక‌రించ‌డంలేదు. స్థానికంగా తమ మద్దతుదారుల నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలన్న ఒత్తిడి ఉందని, ఈ పరిస్థితుల్లో టికెట్టు వదుకోలేమని బాబుకు స్పష్టం చేశారు. చంద్రబాబు ఎంత నచ్చచెప్పినా ఇద్దరు నేతలు పట్టువిడవకపోవడంతో పంచాయితీ ఎటూతేల‌లేదు. ఇద్ద‌రు నేత‌లు జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచే పోటీ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఒక వేల ఇద్ద‌రిలో ఎవ‌రికి టికెట్ ద‌క్క‌క‌పోయినా ఎవ‌రో ఒక‌రు జంప్ అవ‌డం ఖాయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -