Sunday, May 5, 2024
- Advertisement -

కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు ఎఫెక్ట్‌…. ఏపీలో ప్ర‌కంప‌న‌లు

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ , టీడీపీ పొత్తు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పుట్టిన టీడీపీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో దోస్తీ క‌ట్ట‌డం సీనియ‌ర్ నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ కాపులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్ప‌టికే వట్టి వసంతకుమార్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోగా ఇప్పుడు మ‌రో సిన‌య‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పార్టీకి గుడ్‌బాయ్ చెప్పారు.

కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుపై కాంగ్రెస్ నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నేత సి.రామచంద్రయ్య కాంగ్రెస్ ను గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మరికాసేపట్లో రామచంద్రయ్య మీడియా సమావేశంలో రాజీనామా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామనీ, ఇందుకోసం టీడీపీతో జట్టుకట్టాల్సిన పనిలేదని వట్టివసంతకుమార్, రామచంద్రయ్య సహా పలువురు నేతలు హైకమాండ్ కు తెలిపారు. తమ మాటను వినకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంపై మనస్తాపం చెంద‌డంతో సీనియ‌ర్ నేత‌లు పార్టీని వీడుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత రామచంద్రయ్య వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో రామచంద్రయ్య పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం కూడా ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -