Tuesday, May 14, 2024
- Advertisement -

టీడీపీ వేడికి త‌ట్టుకోలేక ఫ్యాన్ కింద‌కు చేరిన వ‌ల‌స ప‌క్ష‌లు..

- Advertisement -

ఎండ‌వేడో లేకా ఎన్నిక‌ల వేడో తెలియ‌దుగాని వ‌ల‌స ప‌క్షులు చ‌ల్ల‌గాలికోసం ఫ్యాన్ కింద‌కు లాంఛ‌నంగా చేరాయి. ఇత‌ర పార్టీల్లో టికెట్లు రానివాల్లు, వైసీపీనుంచి టీడీపీలోకి ఫిరాయించి వైసీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో కొంద‌రికి టికెట్ ద‌క్కినా వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. వైసీపీనుంచి గెలిచిన క‌ర్నూలు ఎంపీ బుట్టారేణుక టీడీపీలోకి ఫిరాయించారు. పార్టీ మారె క్ర‌మంలో బాబు కొన్ని హామీలు ఇచ్చారు. కాని చివ‌ర‌కు మొండిచేయి చూప‌డంతో వేరే మార్గం లేక మ‌ళ్లీ జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు అనంత‌రం వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.దూరం నుంచి చూస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయని, ఆ భ్రమలోనే నాడు వైసీపీని వీడి టీడీపీలో చేరి పొరపాటుచేశానని, ఆ పొరపాటుకు శిక్ష అనుభవించానని చెప్పారు. టీడీపీలో తనను మానసికంగా వేధించారని ఆరోపించిన బుట్టా రేణుక వైసీపీ విజ‌యం కోసం ప‌నిచేస్తాన‌న్నారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు. జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోనె అన్ని వ‌ర్గాల వారికి న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని.. మహిళలు, పేదలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. ప్ర‌జ‌లంద‌రూ జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకుంటున్నార‌ని తెలిపారు.

టీడీపీలో ఎమ్మెల్యేటికెట్ ద‌క్కినా ఆదాల ప్ర‌భాక‌ర్ వైసీపీలోకి జంప్ అయ్యారు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వర్గపోరుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అచేతనంగా మారిపోయిందని దానికితోడు వైసీపీ బలంగా వేళ్లూనుకుపోవడంతో ఆయన పోటీపై పునరాలోచనలో పడ్డ ఆయన వైసీపీలో చేరిన‌ట్లు స‌మాచారం.

టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయన కుమారుడు జగన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -