Wednesday, May 15, 2024
- Advertisement -

కేఈ చూపు వైసీపీ వైపు…!

- Advertisement -

ఆంధ్ర‌ప్రదేశ‌లో అధికార పార్టీపై వ్య‌తిరేక‌త రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆద‌ర‌ణ పెర‌గ‌డంతో టీడీపీలోని కొంద‌రి నాయ‌క‌ల చూపు వైసీపీపై ప‌డింది. ఇప్ప‌టికే కొంద‌రు ఎమ్మెల్యేలు మార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే పార్టీ మారే వారిలో మంత్రులుగా కూడా ఉండ‌టం మ‌రో విశేషం. టీడీపీలో ముఖ్య నాయ‌కుడిగా ఉంటు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చెప‌ట్టిన కేఈ కృష్ణమూర్తి కూడా పార్టీ మారుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో భాగంగానే ఆయ‌న చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌టా! పైగా పార్ఠీలో త‌నకు ప్రాధ‌న్య‌త ఇవ్వ‌డం లేద‌ని కేఈ కృష్ణమూర్తి ప్రధాన ఆరోప‌ణ‌.

పేరుకే త‌న‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చారే కాని , ఈ ప‌ద‌వి వ‌ల్ల త‌న‌కు ఎటువంటి లాభం లేద‌ని,చిన్న పని చేయల‌ని అన్న ముఖ్య‌మంత్రిని అడ‌గి చేయ‌ల‌ని,ఈమాత్రం దానికి నాకు ప‌ద‌వి ఇవ్వ‌డం ఎందుక‌ని కేఈ త‌న స‌న్నిహితులు ద‌గ్గ‌ర వాపోతున్నారని సమాచారం. ప్రస్తుతం టీడీపీ రాయలసీమలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోంటోంది. అందుకే కేఈ పార్టీ మారాలనుకునే చంద్రబాబు తీరును విమర్శిస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కేఈ వైసీపీతో సంప్ర‌దింపులు జరిపినట్టు తెలుస్తుంది. వైసీపీ కూడా కేఈ లాంటి నాయ‌కుడిని తీసుకుంటే పార్టీకి బ‌లం చేకురుతుంద‌ని భావిస్తుంది. దీనిలో భాగంగానే ఆయ‌న చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -