Tuesday, May 14, 2024
- Advertisement -

బాబు చేతికి తూర్పుగోదావ‌రి ఇంటలిజెన్స్ స‌ర్వే…టీడీపీ చాప చుట్టేయాల్సిందే

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. వైఎస్ఆర్ హ‌యాంలో కూడా బాబు ఇంత ఇబ్బంది ప‌డలేదు. కాని జ‌గ‌న్‌ను చూసి బాబు వ‌ణికిపోతున్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి మ‌రో సారి అధికారంలోకి రావ‌డానికి సీఎం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం మాత్రం క‌నిపించ‌డంలేదు.

అనేక స‌ర్వేల ఫ‌లితాలు టీడీపీకీ వ్య‌తిరేకంగా వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. వైసీపీ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌ర్వేలు డంకా బ‌జాయించి చెప్తున్నాయి. ఏపార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఉభ‌య గోదావ‌రి జిల్లాలు ముఖ్య‌మైన‌వి. ఆ రెండు జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది. తాజాగా తూర్పుగోదావ‌రి జ‌ల్లాలో మాత్రం బాబుకు ఎదురుగాలి వీస్తోంది.

ప్ర‌ధానంగా అక్కడి నేతల వ్యవహారశైలిపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందంట‌. ఈసారి ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం కష్టమ‌ని సాక్షాత్తు ఇంటెలిజెన్స్ అధికారులు సమర్పించిన నివేదికలు చెబుతున్నాయి.తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ నేతలను కట్టడి చేయకుంటే తీవ్ర నష్టం తప్పదని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించాయి.

గ‌త ఎన్నిక‌ల్లో భాజాపా, ప‌వ‌న్ అండ‌తో 19 నియోజ‌క వ‌ర్గాల్లో 16 సీట్ల‌ను గెలుచుకుంది. ఈ సారి మాత్రం అలాంటి ప‌ప్పులు వుడ‌క‌వ‌ని ప్రభుత్వం చేయించిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి.అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కొందరు ఆర్థిక లావాదేవీలే కాకుండా సెటిల్ మెంట్లలో తలదూర్చి పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని తేలిపింది.

ప్రస్తుతం జిల్లాలోని 16 మందిలో ఎనిమిది మందిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ 8 మంది నేతలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు దొరకడం అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. కొందరు ఎమ్మెల్యేల తనయులు, సోదరుల దందాలు పార్టీకి నష్టం తెచ్చేవిగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ తన నివేదికలో పేర్కొంది.

కోనసీమలో ఓ ఎమ్మెల్యే సోదరుడు.. కాంట్రాక్టరు-సబ్‌కాంట్రాక్టర్ ల మధ్య వివాదంలో కాంట్రాక్టర్‌ని పోలీస్‌ స్టేషన్‌లో నిర్భంధించి మరీ ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించినట్లు అధికారులు గుర్తించారు. బాబు పాల‌న‌లో రాష్ట్రంలో అవినీతి క‌ట్ట‌లు తెంచుకుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇంటెలిజెన్స్ నివేదిక‌తో బాబులో అల‌జ‌డి మొద‌ల‌య్యిందంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -