Sunday, May 5, 2024
- Advertisement -

రేవంత్ వర్సెస్ కేటీఆర్.. ఈ ఇద్దరిలో సీఎం ఎవరు..?

- Advertisement -

తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ.. దీన్నితెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ని చూసిన ప్రతిఒక్కరు సమర్థిస్తారు.. ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత తెలంగాణ వచ్చిందన్న సంగతి అందరికి తెలుసు.. ఇందులో కేసీఆర్ పాత్ర చాలా ఉంది.. అలాంటి కేసీఆర్ ని ప్రజలు తెలంగాణ మొదటి సీఎం గా చేసి అయన ఋణం రెండో సారి కూడా తీర్చుకున్నారు.. అయితే ఇప్పుడు అదే సీఎం కుర్చీ పైనా తెలంగాణ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.. కేసీఆర్ తర్వాత పార్టీ తరపున ఎవరు సీఎం అంటే కేటీఆర్ అనే అందరు చెప్తారు.. ఎందుకంటే కేసీఆర్ తో పోలిస్తే కేసీఆర్ ఎందులోనూ తీసిపోరు..

ఇప్పటికే పార్టీ కి సంభందించిన భాద్యతలు కేటీఆర్ కి అప్పగించిన కేసీఆర్ కొడుకు ప్రవర్తనను, నాయకత్వ విలువలను దగ్గరుండి చూస్తున్నారట.. దాంతో కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే టైం దగ్గరికొచ్చిందని సన్నిహితులతో చెపుతున్నారట.. ఎటొచ్చి బావ హరీష్ రావు తోనే కేసీఆర్ కి ప్రమాదం ఉంది.. దాన్ని కేటీఆర్ ఎలా అధిగమిస్తాడనేదే ఇక్కడ అసలు ప్రశ్న.. ఇదివరకు కేటీఆర్ పట్ల హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంతో కొంత నిజం లేకపోలేదు.. ఈ నేపథ్యంలో ఈ బావ బామ్మర్దులు ఎలా కలిసి మెలసి ఉంటారనేది చూడాలి..

ఇక తెలంగాణ లో సీఎం గా మరో వ్యక్తి పేరు ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది ఆయనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి.. తెలంగాణ విడిపోయాక నామరూపాల్లేని టీడీపీ లో ఉండి చేసేదేం లేక కాంగ్రెస్ లోకి వచ్చాడు.. ఆ సమయంలో నే రేవంత్ పేరు ఓటుకు నోటు కేసులో మార్మోగిపోయింది.. దాంతో అప్పటివరకు ఎవరికీ తెలియని రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం తెలిసిపోయారు.. ఎన్నికల్లో కూడా ఎక్కువగా తిరగడంతో అయన అందరికి ప్రత్యామ్నాయ నాయకుడిగా కనిపించారు.. అయితే సొంత పార్టీ నేతలనుంచి రేవంత్ కి ఎలా అనుకూలత లభిస్తుందనేది చూడాలి.. ఇప్పటికే కాంగ్రెస్ లోని సీనియర్ లీడర్ లు గుర్రుగా ఉన్నారు.. చాలావరకు పార్టీ కార్యకలాపాల్లో అతన్ని దూరం గా ఉంచుతున్నారు.. దాంతో రేవంత్ కూడా విసిగిపోయి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారట.. ఇదే జరిగితే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ల మధ్య భవిష్యత్ లో ఆసక్తికర పోరు తప్పదనిపిస్తోంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -