Wednesday, May 15, 2024
- Advertisement -

విందు రాజ‌కీయాలు మొద‌లెట్టిన చంద్ర‌బాబు….

- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌కి భారీ షాక్ త‌గిలింది.ఆ పార్టీ సీనియ‌ర్ నేత. కేంద్ర మాజీ మంత్రి కోట్ల టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం అయ్యింది.గతంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరాలని భావించారు. కానీ, కొన్ని కారణాలతో ఆయన టీడీపీలో చేరలేదు. ఏపీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండాలని సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. కాని హైక‌మాండ్ పొత్తు ఉండ‌ద‌ని తేల్చేయ‌డంతో సైకిల్ ఎక్కేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

సీఎం చంద్ర‌బాబు కూడా విందు రాజ‌కీయాలు మొద‌లెట్టారు. ఇత‌ర పార్టీల్లో ఉన్న బ‌ల‌మైన నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకొనేందుకు పావులు క‌దుపుతున్నారు. దీనిలో భాగంగానే కోట్ల‌ను త‌న నివాసంలో విందుకు ఆహ్వానించారు బాబు. త‌న వ‌ద్ద‌ర‌కు రావాల‌ని పిలుపునివ్వ‌డంతో కోట్ల ఆయన నివాసానికి సోమవారం రాత్రి వెళ్లనున్నారు. భార్య, కుమారుడితో కలిసి బాబుతో భోజనం చేయనున్నారు. ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన కోట్ల అనుచరులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈరోజు సాయంత్రమే కోట్ల ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశముందని తెలుస్తోంది.

టికెట్ విషయంతోపాటు పార్టీలో కీలక పదవులపైనా స్పష్టమైన హామీ తీసుకున్నట్లు ఆయా జిల్లాల్లో ప్రచారం జరుగుతుంది. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ మెజారిటీ సీట్లు సాధించడంతో ఈసాధించింది. ఈసారి జ‌రిగి ఎన్నిక‌ల్లో వైసీపీనీ క‌ట్ట‌డి చేయాల‌ని కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. ఆయన రాకను వ్యతిరేకిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని సైతం ఒప్పించినట్లు తెలుస్తోంది. కోట్ల టీడీపీలో చేరితే కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది.

ఇద‌లా ఉంటే తాము వైసీపీలో చేరుతున్నామ‌ని కోట్ల సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి ఫిబ్రవరి 6న వైసీపీలో చేరుతామని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -