Sunday, May 19, 2024
- Advertisement -

FLASH: సీన్ రివర్స్.. నందిగ్రామ్‌లో మ‌మ‌త‌పై సువేందు అధికారి విజ‌యం

- Advertisement -

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్‌లో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పెను సంచలనం నమోదు చేస్తూ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సీఎం మమతా బెనర్జీని ఓడించారు. మ‌మ‌తా బెన‌ర్జీపై 1,736 ఓట్ల తేడాతో సువేందు విజ‌యం సాధించారు. వాస్తవానికి మొదట సువెందు పై మమత గెలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే.

మొద‌టి రౌండ్ నుండి ఇరువురి మ‌ధ్య పోరు హోరాహోరీగా కొన‌సాగింది. రౌండు రౌండుకి ఆధిక్యాలు మారి తీవ్ర ఉత్కంఠ‌ను రేపాయి. చివ‌ర‌కు విజ‌యం సువేందు అధికారిని వ‌రించింది. ఈ నేపథ్యంలో ఈ ఫలితంపై పెద్దగా బాధపడాల్సిన పనిలేదని మమత పార్టీ నేతలను ఊరడించారు. అయితే, ఓట్ల లెక్కింపులో తేడా జరిగిందని, తాము దీనిపై కోర్టుకు వెళతామని ఆమె వెల్లడించారు.

మ‌మ‌తా బెన‌ర్జీ మీడియాతో మాట్లాడుతూ.. నందిగ్రాంలో తీర్పును అంగీకరిస్తున్న‌ట్లు తెలిపారు. నందిగ్రామ్ ప్ర‌జ‌లు ఏ తీర్పు అయినా ఇవ్వ‌నీ… దానిని నేను అంగీక‌రిస్తాను.చింతించకండని పార్టీ శ్రేణుల‌నుద్దేశించి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని గెలిచిన‌ట్లు ఆమె పేర్కొన్నారు.

నందిగ్రామ్ కోసం లెక్కింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేద‌ని దయచేసి ఫ‌లితాలు వెల్ల‌డించ‌వ‌ద్ద‌ని తృణ‌మూల్ ట్వీట్ చేసిన కొద్దిసేప‌టికే సువేందు అధికారి 1,736 ఓట్ల తేడాతో గెలుపొందిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.

తమిళ నాట జయకేతనం ఎగురవేసిన డీఎంకే

విరామ సమయంలో ఆ పనిలో బిజీగా గడుపుతున్న. కాజల్

ప‌శ్చిమ బెంగాల్‌ పోరులో.. పంతం నెగ్గించుకున్న దీదీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -