Tuesday, April 23, 2024
- Advertisement -

ప‌శ్చిమ బెంగాల్‌ పోరులో.. పంతం నెగ్గించుకున్న దీదీ!

- Advertisement -

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాయకుల భవిత్యం ఏంటో తేల్చి చెప్పింది. ఇక అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి ఒకింత చేదు అనుభవాన్నే మిగిల్చాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి గట్టి పోటీ ఇవ్వగలిగిందే తప్ప అధికార పీఠం నుంచి కదిలించలేకపోయింది.

ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్‌ కౌంటింగ్‌లో దీదీ విజయం సాధించారు. సువేందుపై 1200 ఓట్ల ఆధిక్యంతో మమత విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. ఓట్ల లెక్కింపు సందర్భంగా అందరి కళ్లూ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మీదే నిలిచాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తన సీట్ల సంఖ్యను పెంచుకోగలిగిందే తప్ప మమతా బెనర్జీ ధాటికి ఎదురు నిలవలేకపోయింది. 211 స్థానాల్లో తృణమూల్ ఆధిక్యతలో కొనసాగుతోండగా.. బీజేపీ 78 స్థానాలకే పరిమితమైంది.

మొదటి నుంచి 200 స్థానాలు గెల్చుకుంటాం అంటూ వచ్చిన బీజేపీ కనీసం వంద సీట్లు కూడా గెల్చుకోలేకపోయింది. ఈ సందర్భంగా బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కైలాష్ విజ‌య్‌వ‌ర్గియ‌ మాట్లాడుతూ.. ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ సాధించిన విజ‌యం పూర్తిగా మ‌మ‌తా బెన‌ర్జీ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని అన్నారు. ఈ ఓట‌మి త‌ర్వాత తాము ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటామ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. ప్ర‌జ‌లు దీదీకే ప‌ట్టం క‌ట్టారు. ఆమెనే సీఎం కావాల‌ని కోరుకున్నారని అన్నారు.

సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం!

తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం..

నా తల్లిదండ్రులను కాపాడండి ప్లీజ్.. హీరోయిన్ ఆవేదన!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -