Saturday, May 18, 2024
- Advertisement -

తమిళ నాట జయకేతనం ఎగురవేసిన డీఎంకే

- Advertisement -

తమిళనాట డీఎంకే జెండా ఎగిరింది. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకే విజయానికి బాటలు వేసిన స్టాలిన్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తండ్రి రాజకీయ గమనం కోసం సుదీర్ఘ కాలం సర్వ సైన్యాధ్యక్షునిగా వుండిపోయిన ఎంకే స్టాలిన్ కల ఎట్టకేలకు 68 ఏళ్ళ వయసులో నెరవేరబోతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష డిఎంకే ఘన విజయానికి బాటలు వేసిన స్టాలిన్ తన కల నెవేర్చుకోబోతున్నారు.

1953 మార్చి ఒకటిన అప్పటి మద్రాస్ ప్రస్తుతం చెన్నై లో జన్మించారు ఎంకే స్టాలిన్. 1967లో పద్నాలుగేళ్ళ వయసులో పార్టీ పనుల్లో పాలుపంచుకున్నారు. 1967 ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు స్టాలిన్. స్టాలిన్‌ను 20 ఏళ్ళ వయసులోనే డిఎంకే పార్టీ జనరల్ కమిటీ సభ్యునిగా ఎంపిక చేశారు కరుణానిధి. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా.. తండ్రి కరుణానిధి చేయి వీడని పార్టీ వర్కర్‌గా వుంటూ డీఎంకే పార్టీ వారసునిగా పట్టు సాధించారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడమే కాకుండా.. తన చిరకాల స్వప్నమైన సీఎం సీటును కూడా చేరుకోబోతున్నారు స్టాలిన్. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌మ విజ‌యంపై స్పందించారు. డీఎంకే చ‌రిత్ర‌లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది అని స్టాలిన్ స్ప‌ష్టం చేశారు. అయితే కొవిడ్ సంక్షోభం కార‌ణంగా కార్య‌క‌ర్త‌లు సంబ‌రాల‌కు దూరంగా ఉండాల‌ని సూచించాను. మరోవైపు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు నేతలు ట్విట్ చేస్తున్నారు.

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే అభినందన‌లు తెలియ‌జేశారు. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన‌ ఎంకే స్టాలిన్‌కు, అత‌ని బృందానికి నా హృద‌య‌పూర్వక అభినంద‌న‌లు. స్టాలిన్ ను ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్‌ అరవింద్ కేజ్రీవాల్‌ అభినందించారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఫలవంతమైన పాలన సాగించాలని ఆకాంక్షిస్తున్నానని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

విరామ సమయంలో ఆ పనిలో బిజీగా గడుపుతున్న. కాజల్

ప‌శ్చిమ బెంగాల్‌ పోరులో.. పంతం నెగ్గించుకున్న దీదీ!

అభిమాని మరణ వార్తతో భావోద్వేగానికి గురైన ..విజయ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -