Friday, May 17, 2024
- Advertisement -

కరోనా సమయంలో మంచి మనసు చాటుకున్న ఎంపి రేవంత్ రెడ్డి!

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. కరోనా కట్టడి కోసం రాత్రి కర్ఫ్యూ అమలు చేసింది టీ సర్కార్. అయితే రాత్రి కర్ప్యూ వల్ల కరోనా కట్టడి కాదని ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసింది. అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయించింది. ఆ తర్వాత ఎవరు బయటకు వచ్చినా కరోనా నియమాలు ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటారని టీ సర్కార్ తెలిపింది.

ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి ముందు కరోనా బాధితులకు ఉచిత భోజన సౌకర్యం ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. ప్రతీ రోజు వెయ్యి మందికి భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా పేషంట్స్ కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదని అందుకే తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఇంత మంచి పని సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు ప్రారంభించామని అన్నారు.

ప్రతి రోజు 1000 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాక్ డౌన్ ఉన్నంత వరకు భోజన వసతి కల్పిస్తాం..5 రూపాయలకే భోజనమని పేర్కొన్నారు. అయితే డాక్టర్, నర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆహారం ఏర్పాటు చేయలేదని.. ప్రతి రోజు 1000 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బెడ్స్ కొరత, ఆక్సిజన్ , రెమెడిషివర్ కొరత తీవ్రంగా ఇప్పటికైనా వీటిపై టి సర్కార్ దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి : మంత్రి ఆదిమూలపు సురేశ్

‘వకీల్ సాబ్’ కథ ముందుగా ఆ హీరోకే వినిపించారట.. కానీ

రామ్ చరణ్ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -