Monday, May 6, 2024
- Advertisement -

టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి : మంత్రి ఆదిమూలపు సురేశ్

- Advertisement -

ఏపిలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. ప్రతిరోజూ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కరోనా వ్యాప్తి కారణంగా దో తరగతి పరీక్షలపై అనిశ్చితి ఏర్పడింది. వాస్తవానికి జూన్ 7 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకి ఏర్పాట్లు అన్నీ జరిగాయని… ఈ నెలాఖరు వరకూ విద్యార్థులకు సెలువులు ఇచ్చామని తెలిపారు.

జూన్ 1 నుండి ఉపాధ్యాయులందరినీ పాఠశాలలకు రమ్మని చెప్పామని… ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. ఇటీవలే ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడంతో పది పరీక్షలపైనా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ ఇచ్చారు. జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

ప్రస్తుతానికి టెన్త్ విద్యార్థులు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు సన్నద్ధమవ్వాలని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారని.. ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

మమతా బెనర్జీ ఇంట విషాదం!

‘వకీల్ సాబ్’ కథ ముందుగా ఆ హీరోకే వినిపించారట.. కానీ

రామ్ చరణ్ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -