Wednesday, May 22, 2024
- Advertisement -

తిరుపతిలో జ‌గ‌న్ ప్లెక్సీలు క‌ట్ట‌కుండా అడ్డుకుంటున్న అదికారులు…

- Advertisement -

అంద‌రు అనుకున్న‌ట్లుగానె జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌డుతున్న పాద‌యాత్ర‌పై అధికార‌పార్టీ కుట్ర‌లు మొద‌లు పెట్టింది. ఆర‌వ తేదీ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తున్న సంగ‌తి తెల‌సిందే. ఇప్పుటినుంచె అధికార దుర్వినియేగానిక పాల్ప‌డుతు పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌ని చూస్తోంది.

తాజాగా తిరుపతి మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైసీపీ అధినేత జగన్.. తిరుమల వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు తిరుమల చేరుకొని.. రేపు ఉదయం ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంత‌రం ఇడుపుల‌పాయ‌నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు.

తమ ప్రియతమ నేత తిరుమలకు వస్తున్నారనే సంతోషంతో.. వైసీపీ నేతలు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేద్దామనుకున్నారు. అయితే.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వీలు లేదని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారుల తీరుపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలు అనుమతించి.. తమ అధినేత ఫ్లెక్సీలు మాత్రం ఎందుకు అనుమతించరంటూ వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులకు, వైసీపీ నేతలకు వాగ్వివాదం చోటుచేసుకుంది.

మ‌రో వైపు మంత్రి అచ్చెన్నాయుడు పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డానికి చంద్ర‌బాబు ఇచ్చిన సూచ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్నాడు. మేమిచ్చే పెన్షన్ తీసుకుంటూ, రేషన్ తీసుకుంటూ మాకే వ్యతిరేకం చేస్తారా’ అంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబానాయుడు ఓటర్లను బెదిరించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే వరసలో తాజాగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు కూడా జగన్ ను అచ్చంగా అదే విధంగా బెదిరిస్తున్నారు.

ప్రతిపక్ష నేత జగన్ అసలు పాదయాత్రను ఎందుకు చేస్తున్నారో ముందు చెప్పాలని డిమాండ్ చేసారు. గడచిన మూడు నెలలుగా జగన్, వైసీపీ నేతలు చెబుతున్న కారణాలు బహుశా అచ్చెన్నకు అర్ధం కాలేదేమో. చంద్రబాబు పాలనలో జనాలంతా సంతోషంగా ఉన్నపుడు మళ్ళీ జగన్ పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీసారు. జగనపై రాష్ట్రప్రజలకు విశ్వాసమే లేదని కూడా మంత్రి తేల్చేసారు….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -