ఈ పార్టీకి బ‌తుకు లేదు…బొక్కా లేదు.. అచ్చెన్న నిప్పులాంటి నిజాలు..

- Advertisement -

మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తిడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 17న పోలింగ్ త‌ర్వాత అంద‌రం ఫ్రీ అయిపోతామ‌ని, ఈ పార్టీకి బ‌తుకు లేదు…బొక్కా లేద‌ని అచ్చెన్న త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌తో పంచుకోవ‌డం, అది వీడియోల రూపంలో బ‌య‌టికి రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇక పార్టీలో దుస్థితి ఇలా ఉందంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో టీడీపీ నేతకు మధ్య జరిగిన సంభాషణ వీడియో లో పార్టీ క్యాడర్‌ను చంద్రబాబు, లోకేష్‌ వాడుకుని వదిలేస్తున్నారని సదరు టీడీపీ నేత.. అచ్చెన్నాయుడు ముందు గోడు వెల్లబోసుకున్నాడు. మొన్నటి వరకు కాస్త గౌరవం ఇచ్చే లోకేష్.. తమను దొంగగా చూస్తున్నారని.. పెద్దాయన మాట ఇచ్చినా.. లోకేష్ దాన్ని దాటవేస్తున్నారని ఆరోపించాడు సదరు నేత. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. లోకేష్‌ను‌ ఉద్దేశించి ‘ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఆ తర్వాత పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ నేతకు వత్తాసు పలికారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. టీడీపీ భ‌విష్య‌త్‌పై స్వ‌యంగా ఆ పార్టీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ వీడియో విడుద‌లైన నేప‌థ్యంలో తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో ఓ పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. ఇలాంటి దీనమైన స్థితిలో ఉన్న పార్టీకి ఓట్లు వేయ‌డం ఎందుక‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీకి ఓట్లు వేయ‌డం అంటే నారా లోకేశ్ అంటే అస‌మ‌ర్థ నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థించిన‌ట్టే అనే ఆలోచ‌న‌, చ‌ర్చ తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో సాగుతోంది.

పార్టీ భ‌విష్య‌త్‌పై స్వ‌యాన అధ్య‌క్షుడైన అచ్చెన్నాయుడికే లేన‌ప్పుడు, ఇక దాన్ని తామెందుకుని నెత్తికెత్తుకోవాల‌నే ఆలోచ‌న ఓట‌రులో సాగుతోంది.లోకేశే బాగుంటే, ఈ పార్టీకి ఈ దుస్థితి ఎందుక‌ని స్వ‌యంగా అచ్చెన్నాయుడే ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం ఈ వీడియోలో హైల్‌ట్‌గా నిలిచింది. ఏదో మొద‌టి నుంచి ప‌ట్టుద‌ల‌తో లాక్కొస్తుండ‌డంతో, ఈ మాత్ర‌మైనా పార్టీ బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌గ‌లిగింద‌నే చేదు వాస్త‌వాన్ని అచ్చెన్నాయుడు వ్య‌క్తం చేశారని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ వీడియోపై స్పందించిన అచ్చెన్న టిడిపిలో విభేదాలు సృష్టించ‌డానికే తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఈ వీడియోలో తాను మాట్లాడినట్లుగా వున్న మాటల్లో నిజం లేదన్నారు అచ్చెన్న. టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుగారి నాయ‌క‌త్వంలో తిరుప‌తి ఎన్నిక‌కు ఐక‌మ‌త్యంగా ప‌నిచేస్తుండ‌డంతో నీకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. టీడీపీ యువ నాయకుడు లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని విడ‌దీయ‌లేవని ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.

వివేకా హత్యపై నారా లోకేష్ విసిరిన స‌వాల్‌కి తోక‌ ముడిచావని జగన్‌ని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.నిన్న చంద్రబాబు స‌భ‌పై రాళ్లేయించారని, ఇవాళ తన సంభాష‌ణ‌ల్ని వ‌క్రీక‌రించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన సొంత ఛానళ్ల ద్వారా ఎన్ని త‌ప్పుడు‌ వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించ‌లేవని జ‌గ‌న్‌పై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.

పరీక్షలు వద్దు.. తేల్చి చెప్పిన సీఎం సర్..!

ఉగ్రరూపంగా బాలయ్య ‘అఖండ’ టీజర్!

బిడ్డకి తల్లి కావాలి అని శిక్ష నుంచి విముక్తి.. అసలు కథ ఏమిటంటే..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -
- Advertisement -