- Advertisement -
సినీ నటుడు పవన్ కల్యాణ్ , జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. 2014లోనే పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఆ ఎన్నికలలో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల రణరంగంలోకి దూకుతున్న పవన్ కల్యాణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ గుర్తును కేటాయించింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు వివిధ గుర్తులను కేటాయించిన ఈసీ.. పవన్ జనసేనకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయిస్తూ శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ‘గాజు గ్లాసు’ గుర్తుతోనే బరిలోకి దిగనున్నారు. జనసేనకు ఎన్నికల సంఘం గుర్తు ప్రకటించిన వెంటనే ఆ పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా జనసేన కార్యకర్తలు, అభిమానులతో ఆ విషయాన్ని పంచుకున్నారు.
