జనసేన పార్టీ మరో ప్రజారాజ్యం పార్టీగా మారుతుందా…? పార్టీలో ఒకే సామాజికి వర్గానికి పదవులు కేటాయించడంతో పార్టీ నేతలలో అసంతృప్తి నెలకొందా…? పవన్‌కు , జనసేన అభిమానులు, కార్యకర్తలకు మధ్య సొంత సామాజికి వర్గం కోటరీ ఉందా..? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
కులాలకు, మతాలకు అతీతంగా ఎన్నో ఆశయాలతో పవన్ జనసేన పార్టీని స్థాపించారు. సినిమా హీరోగా పవన్‌కు తిరుగులేని అభిమానం ఉంది. అంతేకాదు మెగా కుటంబం మొత్తం అభిమానులు సపోర్ట్‌గా ఉన్నారు. ఆయతో పాటే అనుకున్న వారంతా పార్టీలో వచ్చి చేరారు. నిష్కల్మషమైన ప్రేమతో పార్టీని ఇన్నాళ్ళూ కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు అలాంటి వాల్లకి గట్టి షాక్ తగిలింది.
అయితే పార్టీలో నిజాయితీగా పనిచేస్తున్న వాల్లకు కాకుండాపవన్ జనసేనలో ప్రజారాజ్యం మాజీ నాయకులకే పెద్ద పీట వేస్తున్నారని అసలైన ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. పార్టీకోసం కష్టపడుతున్న తమకు పదవులు ఇవ్వకుండా ప్రజారాజ్యం మాజీ నాయకులకే పదువులు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండంతో కొన్ని జిల్లాలకు కార్యదర్శులనుపవన్ నియమించారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు కూడా బాధ్యులను నియమించారు. వీరిలో ప్రజారాజ్యంలో పనిచేసిన వారే ఎక్కువగా ఉండడంతో జనసైనికులకు దిమ్మ తిరిగిందట.
పవన్ పార్టీపై టీడీపీ మంత్రులూ, ఎమ్మెల్యేలు తరచూ అంటున్నట్లుగా అది ప్రజా రాజ్యం అంటూ విమర్శలు చేసిన సంగతితెలిసిందే. టీడీపీ నేతలు అన్నట్లు ఇప్పుడు జనసేన మరో ప్రజారాజ్యంగా మారుతుందా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీ పదవులు అన్నీ ఒకే సామాజికవర్గానికి ఇవ్వడంపైనా రచ్చ అవుతోంది. కుల మతాలకు తాను అతీతం అని చెప్పే పవన్ సొంత పార్టీలో ఇలా చెయడమేంటన్న ప్రశ్నను జనసైనికులే వేస్తున్నారు.
ఇక పవన్ చుట్టూ ఓ బలమైన కోటరీ ఉందని, వారే అక్కడ అంతా అన్నట్లుగా పరిస్థితి ఉందని ప్రచారమూ ఉంది. ఇపుడు పవన్ ఫ్యాన్స్, అసలైన జనసైనికులను ఆ కోటరీయే అడ్డుకుంటోందట. అంటే పవన్ కి, బయట ప్రపంచానికి మధ్య ఓ ఇనుప తెరలా ఈ కోటరీ పనిచేస్తోందని అంటున్నారు. ఇదే నిజమైతే పవన్ పార్టీకి చాలా రిపేర్లే చేసుకోవాలి.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని ప్రకటించారు. వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని పవన్ పార్టీనీ తీర్చి దిద్దుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో వస్తున్న అసమ్మతి జ్వాలను ఆర్పే ప్రయత్నం చేస్తా లేదా అన్నది చూడాలి.
