Tuesday, May 21, 2024
- Advertisement -

ప‌వ‌న్‌పై ఉన్న ఆశ‌లు గ‌ల్లంతు..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం టీడీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కాని అవ‌న్నీ ఏమాత్రం ప‌లించ‌డంలేదు. చివ‌రికి ప‌వ‌న్‌పై ఆశ‌లు పెట్టుకుంది.కాని అక్క‌డ‌నుంచి తీవ్ర నిరాశె ఎదుర‌య్యింది అఖిల‌ప్రియ‌కు.ఉద్దానం కిడ్నీ బాధితుల విష‌యంలో చంద్ర‌బాబును క‌ల‌సిన స‌మ‌యంలో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తానొ రెండు రోజుల్లో చెప్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికే మద్దతివ్వాలని పవన్ ను కోరతానని మంత్రి అఖిల ప్రియ అన్నారు. అయితే పవన్ నుంచి ఈ విషయం పై ఎటువంటి స్పందనా రాలేదు. మద్దతు గురించి చర్చించేందుకు పవన్ అపాయింట్ మెంట్ కోసం అఖిల ప్రియ ప్రయత్నించి విఫలమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార – ప్రతిపక్షాలు వాడి – వేడిగా ప్రచారం సాగిస్తున్నాయి. టీడీపీ ఆశలన్నీ పవన్ కళ్యాణ్ పై పెట్టుకొని ఉంది. పవన్ మద్దతు తమకేనని అఖిల ప్రియ మొదటి నుంచి ధీమాతో ఉన్నారు. పవన్ తో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నందున ఆయన బ్రహ్మానందరెడ్డికే మద్దతిస్తారని ఆమె చెప్పారు. ఇదే విషయమై ఆమె పవన్ కళ్యాణ్ అపాయింటుమెంట్ అడిగారని ఆయన అందుకు నిరాకరించాడని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పవన్ డైలమాలో ఉన్నందునే అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వినికిడి.

ఒక వేళ పవన్ భూమా కుటుంబానికి మద్దతివ్వాలనుకుంటే ముందే ఇచ్చేవారనే వాదన వినిపిస్తోంది. రాజకీయాలు వేరు కుటుంబం వేరు…అన్న సూత్రాన్ని పవన్ విశ్వసిస్తారు. కుటుంబ పరిచయాల కోసం పవన్ గుడ్డిగా మద్దతు పలకరని అనుకుంటున్నారు. 2019లో జనసేన ఒంటరిగా లేదా లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. అందుకే ఇప్పుడు ఏ పార్టీకి మద్దతు పలకడం లేదని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -