- Advertisement -

జగన్‌పై షర్మిల బ్రహ్మాస్త్రం!

- Advertisement -

ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ టార్గెట్‌గా రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ సర్కార్‌ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు అన్ని ఏకం అవుతున్నాయి. ఇప్పటికే జనసేన – టీడీపీ…జగన్‌కు వ్యతిరేకంగా జట్టుకట్టగా త్వరలో బీజేపీ సైతం ఈ కూటమిలో చేరే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. అలాగే వామపక్షాలు మరో కూటమిగా, కాంగ్రెస్ కూడా జగన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా గళం విప్పేందుకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జగన్ సర్కార్‌ని విమర్శించే వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు షర్మిల, నారా బ్రాహ్మాణి. ఇక త్వరలో షర్మిల కాంగ్రెస్‌లో చేరనుంది. షర్మిల సేవలను తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఇక అన్న జగన్‌ పై పోరాటానికి సిద్ధమవుతుందన్న వార్త పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారగా తాజాగా బ్రహ్మణి సైతం చేరిపోయింది.

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత లోకేష్‌ అరెస్ట్ కూడా ఉంటుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో టీడీపీ ‘ప్లాన్ బీ’ని తెరపైకి తెచ్చింది. బాలకృష్ణ, భువనేశ్వరితో పాటు బ్రాహ్మాణి ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇక బ్రహ్మాణీతో పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇంతవరకు బాగానే ఉన్నా బ్రహ్మాణి…జగన్‌పై విమర్శలు చేస్తే ఓకే కానీ షర్మిల విమర్శలు చేయడమే హైలైట్‌గా నిలుస్తుంది. ఎందుకంటే సొంతచెల్లి విమర్శలకు కౌంటర్‌ ఇవ్వాల్సిన పరిస్థితి జగన్‌కి వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ తన చెల్లికి ఎలా కౌంటర్ ఇస్తారో..ఈ కౌంటర్‌ని షర్మిల ఎలా తిప్పికొడుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -