Sunday, May 5, 2024
- Advertisement -

హోదా, ప్యాకేజ్, పోలవరం, జోన్….. పాపం బాబుదే అని జగన్ చెప్పడం తప్పా?

- Advertisement -

చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ అందరూ కూడా జగన్‌ని నిలదీయడానికి అడుగుతున్న ఒక ప్రశ్న…..జగన్‌పై విమర్శలు చేయడానికి అవకాశంగా చూస్తున్న ఒకే ఒక్క అంశం…..మోడీపై జగన్ ఎందుకు విమర్శలు చేయడం లేదు? చంద్రబాబుపైనే ఎందుకు చేస్తున్నాడు? అని. చంద్రబాబు నాలుగేళ్ళు చిప్ప చూపించిన తర్వాత కూడా ఇంకా మోడీ దగ్గర ఎందుకు సాగిలపడి ఉన్నాడు? జగన్‌పైన పడి ఏడవడం తప్ప మోడీ పేరు ప్రస్తావించి ఒక్క విమర్శ కూడా డైరెక్ట్‌గా ఎందుకు చేయలేకపోతున్నాడు అనే విషయాలు పక్కనపెడదాం. చివరి బడ్జెట్‌లో చిప్ప చూపించాక కూడా 14 రోజులు అజ్ఙాతవాసంలో ఉండి పేపర్ టైగర్ నాటకాలు ఎందుకు వేశాడు అన్న విషయం పక్కనపెడదాం. కానీ జగన్‌ని అనే అర్హత అసలు బాబు అండ్ బ్యాచ్‌కి ఉందా?

ముందుగా తెలంగాణా పోరాటం వ్యవహారాన్ని చూద్దాం. పోరాటం ఢిల్లీలో చేశారా? తెలంగాణాలో చేశారా? పోరాటం చేసింది సోనియానా? కెసీఆరా? ఈ ప్రశ్నలకు సమాధానం మన అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఫైట్ ఎక్కడ చేయాలి? పోరాటం చేయాల్సింది నరేంద్రమోడీనా? చంద్రబాబా? ఇప్పుడు మోడీ శక్తివంతుడైతే అప్పుడు సోనియా ఇంతే శక్తువంతురాలని స్వయానా చంద్రబాబే చెప్పాడు. అలాంటి శక్తివంతురాలైన సోనియాతో పోరాడబట్టే జగన్‌పై కేసులని కూడా తానే స్వయంగా చెప్పాడు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు చేస్తున్నది ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ కేంద్రప్రభుత్వం నిర్మిస్తే తనకు మిగిలేది ఏంటి అని ఆ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అదేంటంటే కేంద్రం నిర్మిస్తే ఏళ్ళూ పూళ్ళూ పడుతుందన్నాడు. మరి సొంతంగా నిర్మిస్తే అన్నేళ్ళు తీసుకునే కేంద్రం చంద్రబాబు నిర్మిస్తానంటే మాత్రం వెంటనే నిధుల వరద పారిస్తుందా? ఆ నిధుల వరద పారించే ఆలోచనే ఉంటే తనే నిర్మించదా? ప్రాజెక్ట్ నిర్మిస్తే వచ్చే లంచాలను బిజెపి నేతలు ఎందుకు వదులుకుంటారు? కనీసం తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత అయినా వైనంగా ఏమైనా పనులు చేశాడా? టిడిపి ఎంపి రాయపాటి, టిడిపి నేతలు, అధినేతల బొక్కసాలకు ఉపయోగపడేలా అంచనాలు పెంచడం, దండుకోవడం లాంటి వ్యవహారాలపైనే శ్రద్ధ. డబ్బులు ఇవ్వండి…..ఎలా ఖర్చుపెట్టానని మాత్రం అడగొద్దు అంటాడు.

ఇక ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి చాలా ఉపయోగం. కాకపోతే అధికారంలో ఉన్నవాళ్ళకు మాత్రం లంచాల లాభాలు అంతగా ఉండవు. అదే ప్యాకేజీ అయితే పూర్తిగా దండుకోవచ్చు. అన్నీ తెలిసే చంద్రబాబే ప్యాకేజ్ కావాలని కేంద్రాన్ని ఒప్పించాడు. కర్ణాటకతో సహా ఇతర రాష్ట్రాల్లో గెలుపు కోసం చూస్తున్న మోడీ కూడా ఇదే సందని తూతూ మంత్రపు ప్యాకేజ్ ప్రకటించేలా చేశాడు. ఆ ప్యాకేజ్ ఏంటో కూడా చూడకముందే ఎంతో కొంత నిధులొస్తే పచ్చ బ్యాచ్‌కి చాలని చెప్పి ప్యాకేజ్ అద్భుతం అనేశాడు చంద్రబాబు.

ఇక రైల్వే జోన్ విషయంలో కూడా కథ సేం. వైజాగ్‌కి జోన్ తీసుకువచ్చే ఉద్ధేశ్యం టిడిపికి అస్సలు లేదు. ఆ జోన్‌ని విజయవాడకు తీసుకురావడానికి నానా రాజకీయాలూ చేస్తున్నారు. అలాగే అమరావతిలో హైకోర్ట్, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల కోసం కేంద్రం 1500కోట్లు ఇచ్చింది. కానీ చంద్రబాబు ఏం చేశాడు? రెండు తాత్కాలకి భవనాలు……అది కూడా చిన్న వర్షం వస్తే నీళ్ళు కారే స్థాయి క్వాలిటీతో కట్టించాడు. నిధులన్నీ బొక్కసాలకే సరిపోయినట్టున్నాయి. ఎలా ఖర్చు చేశారో చెప్పమంటే మాత్రం చెప్పరు.

ఇలా ప్రతి విషయంలోనూ ముందుగా చంద్రబాబువైపు నుంచే తప్పులు కనిపిస్తున్నాయన్నది నిజం. ఇదే విషయాన్ని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటూ హంగామా చేసిన పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా ఒప్పుకున్నాడు. మరి ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్ విమర్శించాల్సింది ఎవరిని? తాను ప్యాకేజీలకు కక్కుర్తి పడడమే కాక హోదా కోసం పోరాటం చేస్తున్న జగన్ పార్టీ శ్రేణులను, జగన్‌ని…ఇతర విపక్షాల నాయకులు, ప్రజలను కూడా ఓ స్థాయిలో అణచివేస్తూ ఉన్నాడు చంద్రబాబు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నిజాయితీగా పోరాడే ఎవరైనా ముందుగా ఎవరిపైన పోరాటం చేయాలి? అసలు వైఎస్ జగన్ ప్రత్యేక హోదా పోరాటం చేయకుండా ఉండి ఉంటే, పట్టిసీమ నుంచీ పోలవరం వరకూ చంద్రబాబు అవినీతి వ్యవహారాలు బయటపెట్టకుండా ఉండి ఉంటే, భారతదేశంలోనే నంబర్ ఒన్ అవినీతి రాష్ట్రంగా నిలబడడానికి గల కారణం ఏంటి నిలదీయకుండా ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండేది?

రాజధాని నిర్మాణం, హోదా, పోలవరం, రైల్వేజోన్………ఇలా అన్ని విషయాల్లోనూ చంద్రబాబు అవినీతి వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ముందుగా నిలదీయాల్సింది ఎవరిని? తెలంగాణా అవసరం లేదు అని కేసీఆరే చెప్పి ఉంటే…..తెలంగాణా ప్రజలను కన్విన్స్ చేసి ఉంటే సోనియా తెలంగాణా ఇచ్చేదా? ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది అది కాదా? తన స్వార్థం కోసం వ్యవహరిస్తూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ తాకట్టు పెట్టేయలేదా?

ఈ విషయాలన్నీ పచ్చ బ్యాచ్‌కి, భజనసేనుడుకి, మేధావులం అని చెప్పుకుంటూ బాబు కోసం పనిచేసేవాళ్ళకు బ్రహ్మాండంగా తెలుసు. కానీ చంద్రబాబు తప్పుల గురించి మాత్రం మాట్లాడరు. పోరాటం చేస్తున్న జగన్ విశ్వసనీయతను దెబ్బతీయడం, ప్రజలకు జగన్‌కి అండగా ఉండకుండా చేసే కుటిల ప్రయత్నాల్లో మాత్రం భాగం అవుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే అప్పుడు సోనియా అయినా, మోడీ అయినా సీమాంధ్ర ప్రాంతాన్ని లైట్ తీసునేది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -