Sunday, May 5, 2024
- Advertisement -

మునుగోడు బరిలో చంద్రబాబు.. ఆ ఓటు బ్యాంక్ చిలుతుందా ?

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ముచ్చట విస్తృతంగా సాగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికలను అన్నీ ప్రధాన పార్టీలు అత్యంత కీలకంగా తీసుకున్నాయి. ఎలాగైనా మునుగుడు ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 3న జరుగుతుండగా.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. టి‌ఆర్‌ఎస్ పరుపున కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరుపున పల్వాయ్ స్రవంతి రెడ్డి, బిజెపి తరుపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. .

అయితే పోటీ ఇంత రసవత్తరంగా ఉన్నప్పటికి మునుగోడు బరిలో టీడీపీని కూడా దించేందుకు చంద్రబాబు సిద్దమయ్యారా ? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకునేందుకు చంద్రబాబు సిద్దమయ్యారట. మునుగోడు బరిలో ఉన్న ప్రధాన పార్టీలు టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే టికెట్లు ఇవ్వడంతో.. బి‌సి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఆ మూడు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు చెప్పడంతో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక మునుగోడులో దాదాపు 75 శాతం బీసీ సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు.

వారిలో గౌడ, ముదిరాజ్, పద్మశైలి, మున్నూరు కాపు, వంటి సామాజికవర్గానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. కానీ ప్రధాన పార్టీలు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే టికెట్లు కేటాయించడంతో.. టీడీపీ పార్టీ బీసీ లను టార్గెట్ చేస్తూ మునుగోడు బరిలో దిగి సత్తా చాటలని ప్రణాళికలు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీకి తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆధారణ లేదు. మరి ఒకవేళ టీడీపీ మునుగోడు బరిలో దిగి.. బీసీ నేతకు టికెట్ ఇస్తే మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి కొంత ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంది. మరి మునుగోడు ఉపఎన్నికతో తెలంగాణలో సత్తా చాటెందుకు చూస్తున్న టీడీపీ ప్రణాళికలు ఎంతమేర సక్సస్ అవుతాయో చూడాలి.

Also Read

ఎన్నికలంటే జగన్ కు భయమా ?

పులివెందుల సీటు సునీతకే.. మరి జగన్ పరిస్థితి ?

జగన్ను ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -