Saturday, May 18, 2024
- Advertisement -

టీడీకి మరో షాక్.. వారు కూడా వైసీపీలోకి..?

- Advertisement -

ఏపీ అధికార పార్టీ టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ టైంలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్టార్ట్ చేసారో కానీ.. ఇప్పుడు టీడీపీకే షాక్ తగులుతోంది. ఏపీలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన స్టార్టింగ్ లో వైసీపీ నుంచి నేతలో టీడీపీలో చేరినా.. ఇప్పుడు తాజాగా టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి. సాధారణంగా వలసల పర్వం అనేది ప్రతిపక్షం నుండి అధికార పక్షంలోకి వెళ్తుంటారు. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ లో నడుస్తోంది.

ఇప్పటికే శిల్పా సోదరులు ఇద్దరు జగన్ వద్దకు చేరారు. అలానే నెల్లూరు నుంచి ఆనం సోదరులు ఇద్దరు వైసీపీ పంచన చేరాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో జేసి సోదరులు కూడా జగన్ వద్దకు చేరలని చూస్తున్నట్లు తేలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి కరం బలరాం వైసీపీ చెంత‌కు చేరేందుకు రెడీగా ఉన్నాడు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. టీడీపీలో ఫిరాయింపుల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం, ఎప్ప‌టి నుండో టీడీపీని అంటిపెట్టుకొని క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు తోడుగా ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌ను టీడీపీ విశ్మ‌రించ‌డం.. రాష్ట్రంలో చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ చేసే భాగోతాలు బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌నుండి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వ‌డం… ఇవ‌న్నీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ప్ర‌తికూలాలు.

ఇటువైపు జగన్ మోడీతో బంధం పెంచుకోవడం.. ప్రజల్లో జగన్ ఎక్కువగా ఉండటం.. అన్ని విషయల్లో జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వైసీపీకి అనుకూల వాతావార‌ణ‌మే. దీంతో ఇప్పుడు వైసీపీ వైపు నాయకులతో పాటు ప్రజలు చూస్తున్నారు. నంద్యాల‌లో వైసీపీ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ కోసం వ‌చ్చిన ప్ర‌జా స‌మూహాన్ని చూస్తే తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిదని. అంతేకాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపీలో.. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం అని అన్నారు. ఏది ఏమైన ఎన్నో సమస్యలను జగన్ మొండిగా ఎదురుకొని ప్రజల పక్షనా నిలబడ్డాడు కాబట్టే.. ఈ రోజు జగన్ కి జనంలో ఆ అభిమానం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -