Wednesday, May 15, 2024
- Advertisement -

ప‌వ‌న్‌కంటే చిరంజీవి వంద‌రెట్టు శ‌క్తి వంతుడు..పవన్ ఓడిపోతారు

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో అన్ని సీట్ల‌లో ఒంరిగా పోటీ చేస్తామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ దిశ‌గా పార్టీ నిర్మానం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే గెలుపు అభ్య‌ర్తుల వేట‌లో మునిగిపోయారు జ‌న‌సేన నాయ‌కులు. టీడీపీకి త‌న మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించి న‌ప్ప‌టినుంచి టీడీపీకి జ‌న‌సేన‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే భ‌గ్గుమంటోంది. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని జ‌న‌సేన‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేసినా ఓడిపోతారని ఈ ఎంపీ జోష్యం చెప్పారు. తనకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసని, తన అంచనాలు తప్పవని ఈ ఎంపీ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ను తను దగ్గర నుంచి గమనించాను అని ఆయనకు స్థిరత్వం ఉండదని, ఒక మాట మీద నిలబడలేరని… ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో ప‌వ‌న్‌కే తెలియ‌ద‌ని చెప్పుకొచ్చారు.

గ‌తంలో ప్ర‌జారాజ్యంపార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ప‌వ‌న్‌కంటే చిరంజీవి వంద రెట్లు శ‌క్తివంతుడ‌ని ..పవన్ కల్యాణ్ కన్నా చిరంజీవికి క్రేజ్ కూడా చాలా ఎక్కువ అని నాని అన్నారు. చిరంజీవికూడా ఒక చోటు ఓడిపోయార‌ని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అనేది చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు కలిసి ఏర్పాటు చేసిన వ్యవస్థ అని.. దానికే 18 సీట్లు వచ్చాయని, చిరంజీవి స్వయంగా పోటీ చేసి ఓడిపోయారని.. పవన్ కల్యాణ్‌కూ అదే అనుభవం అని తప్పదని నాని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -