Sunday, May 5, 2024
- Advertisement -

భాజాపా తీర్థం పుచ్చుకోనున్న టీడీపీ ఎంపీ

- Advertisement -

టీడీపీకి త్వ‌ర‌లో మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంచా. ఆ పార్టీ మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ సుజ‌నాచౌద‌రి భాజాపా తీర్థం పుచ్చుకోనున్నార‌నే వార్త‌లు టీడీపీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. దీంతో పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒకప్పుడు టీడీపీలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తర్వాత కీలక పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.

2014 ఎన్నికల్లో టీడీపీకి విరాళాల సేకరణ, ఇతర పార్టీల నేతల చేరికల విషయంలో సుజనా కీలకంగా వ్యవహరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విషయాల్లోనూ ఆయన ప్రధాన పాత్ర వహించారు. కేబినెట్‌ మంత్రుల ఖరారు నుంచి కీలక ప్రాజెక్టుల అప్పగింత వరకు ఆయన కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు విశ్వసనీయుడు కావడంతో కేంద్రమంత్రి పదవి కూడా ఆయనను వరించింది. చంద్రబాబు సందేశాలను ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు చేరవేయడంలో, ఢిల్లీలో టీడీపీ తరఫున పనిచేయడంలో సుజనా ప్రముఖంగా వ్యవహరించారు. రాష్ట్రానికి, టీడీపీకి ఢిల్లీలో ఏకైక ప్రతినిధి తానే అన్నట్టుగా సుజనా వ్యవహారం సాగిపోయింది

ఎన్ సిబిఎన్ వాట్సప్ గ్రూపులో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఓ మాట అన్నారు. ఈ గ్రూపులో మత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. తమకు అటువంటి సమాచారం ఏదీ లేదని, నిజమేమిటో బయటపడనీయండి అని లోకేష్ ఆ గ్రూపులో అన్నారు. సుజనా చౌదరిపై గ్రూపులో చర్చ సాగుతోందని చెప్పడానికి అది ఉదాహరణ.

నంద్యాల ఉప ఎన్నికను వాయిదా వేయించడంలో విఫలమయ్యారనే కారణంతో సుజనా చౌదరితో కొంత మంది టీడీపి నాయకులు విభేదిస్తూ వచ్చారు. ఏడాదిన్నర పాటు చంద్రబాబుకు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల సుజనా చౌదరితో దూరం మరింత పెరిగిందని అంటున్నారు. దీనికి బ‌లం చేకూర్చే విధంగా పార్లమెంట్ స‌మావాశాలు ముగిసిన‌ప్ప‌టినుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుజ‌నా ఎక్క‌డా క‌నిపించిన దాఖ‌లాలు లేవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -