Wednesday, May 15, 2024
- Advertisement -

సీఎం జగన్ పై టీడీపీ కొత్త అటాక్….మరి వైసీపీ ఎదుర్కొంటుందా..?

- Advertisement -

వైసీపీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ఎన్నికలు ముందు దూకుడుగా ఉన్న సోషల్ మీడియా ఎన్నికల తర్వాత దూకుడు కనిపించడంలేదు. తిరుగులేని మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ సీఎం పీఠం ఎక్కారు. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియాతో టీడీపీ జగన్ ను టార్గెట్ చేస్తోంది. రావాలి జగన్….కావాలి జగన్ అనే నినాదంతో ఎలా అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అదే రూట్ లో జగన్ కు వ్యవతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టింది లోకేష్ అండ్ సోషల్ మీడియా టీమ్.

జగన్ ప్రభుత్వానికి ఆరు నెలలు టైం ఇస్తామని చెప్పిన టీడీపీ మాటతప్పి….రాష్ట్రంలో పరిణామాలు మారిపోయాయంటూ రెండు నెలలకే ఎదురు దాడి ప్రారంభించింది. పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయంటూ గగ్గోలు పెడుతోంది.ప్రజావేదిక కూల్చివేతలు, చంద్రబాబు నివాసం, కాపుల రిజర్వేషన్లు, పోలవరంలో అవినీతి, అన్న క్యాంటీన్ల మూసివేత, వరద రాజకీయాలు ఇలా వరుసగా జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటలంలో పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.

సోషల్ మీడియా బాధ్యతలు లోకేష్ తీసుకున్నాక మరింత దూకుడు పెంచింది. చినబాబు అయితే ట్విట్టర్ లో ట్వీట్లకు కొదువ లేదు. అయితే ఇప్పుడు కొత్తగా జగన్ నుటార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ‘#YSJaganFailedCM’పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటూ పార్టీ ముఖ్య నేతలంతా ఇదే హ్యాష్ ట్యాగ్‌ను ట్వీట్‌ చేస్తున్నారు. మరి వైసీపీ సోషల్ మీడియా ఎలా కౌంటర్ అటాక్ చేస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -