Saturday, May 4, 2024
- Advertisement -

కడపజిల్లాలో టీడీపీ కి బలం పెరుగుతుందా…?

- Advertisement -

రాజకీయాల్లో కడప జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది.. ఎంతో మంది రెబల్ లీడర్లు ఇక్కడినుంచి వచ్చిన వారే.. రాజకీయాల్లో ఇప్పటి ప్రభుత్వంలో, గత ప్రభుత్వాల్లోనూ ఇక్కడి రాజకీయ నాయకులు క్రియాశీల పాత్ర పోషించారు. ఇక ప్రస్తుతం ఇక్కడ టీడీపీ అత్యంత దారుణంగా తయారైంది అని చెప్పొచ్చు.. ఈ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలను, రెండు ఎంపీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం తో చంద్రబాబు కి ఈ ప్రాంతం మీద చూపిన అశ్రద్ధ క్లియర్ గా తెలిసిపోయింది.. ఇక్కడ రాజకీయాల్లో టీడీపీ తరపున చక్రం తిప్పిన హేమా హేమీలు ఉన్నా కూడా వారు వారి అవినీతి ని తట్టుకోలేక ఓడలని బళ్ళు చేశారని అర్థం చేసుకోవచ్చు.. ఇక ఇంత దారుణంగా ఓడిపోవడంతో అక్కడి టీడీపీ నేతలు కనీసం బయటకి కూడా రావడం లేదట..

చంద్రబాబు జూమ్ కాల్స్ తోనే సరిపెట్టుకుని ఏం మొహం పెట్టుకుని ప్రజల ముందుకు రావాలి అని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.. ముఖ్యంగా పొద్దుటూరు లోని టీడీపీ పరిస్థితీ హీనంగా ఉందట.. ఇక్కడ టీడీపీ కి  మ‌ల్లెల లింగారెడ్డి  నాయకత్వం వహిస్తున్నారు.. ఆయన 1999, 2004లో వ‌రుస‌గా ఓడిపోయాడు. 2009 లో గెలుపొందారు.. కానీ 2014 లో ఆయనను కాదని టీడీపీ వరదరాజులు కి టికెట్ ఇచ్చారు. కానీ ఓడిపోయారు.. 2019 లో మళ్ళీ లింగా రెడ్డి కి ఇచ్చారు.. జగన్ మేనియా లోమళ్ళీ ఓడిపోయారు. వైసీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్‌రెడ్డి ఆయనను దారుణంగా ఓటమి చవిచూసేలా చేశారు. గత 25 ఏళ్ళల్లో ఇక్కడ కేవలం ఒక్కసారే టీడీపీ వచ్చింది అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..

కానీ టీడీపీ ఆశలకు చిగురునిస్తూ ఇక్కడ ఉక్కు ప్రవీణ్ అనే నాయకుడు టీడీపీ తరపున ప్రజలను ఆకర్షిస్తున్నాడట.. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు చేసిన ఆయనకు ఈ బిరుదు ఇచ్చారని అంటున్నారు.. ‌మల్లాపురం మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి త‌మ్ముడి కొడుకు అయిన ప్రవీణ్ సత్తా తెలిసి ఆయనకు టీడీపీ బాధ్యతలు ఇచ్చారట చంద్రబాబు.. దీనికి తోడు రాచమల్లు పై ప్రజలకు నమ్మకం సడలడం తో ప్రవీణ్ కు ఎక్కువ మొగ్గు చూపుతున్నారట ప్రజలు.. స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని అయన పై అభియోగాలున్నాయి మరి ఉక్కు సంకల్పం తో ప్రవీణ్ రాబోయే రోజుల్లో ఇక్కడి టీడీపీ చరిత్ర ను మారుస్తాడా అనేది చూడాలి..   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -