Saturday, May 18, 2024
- Advertisement -

బాబు కేబినెట్ నుంచి అఖిలప్రియ తొలగింపు?..నిజ‌మా..?

- Advertisement -

మంత్రి అఖిల ప్రియ‌కు త్వ‌ర‌లో చంద్ర‌బాబు బిగ్‌షాక్ ఇవ్వ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో కేబినేట్ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌నే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నిక‌లు ఎక్క‌వ దూరం లేనందున కుల‌,స‌మీక‌ర‌ణాల ఆధారంగా కేబినేట్ విస్త‌ర‌ణ చేయ‌నున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ప్రత్యేకించి బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ముస్లింలకు ఒక మంత్రి పదవిని ఇచ్చేసి.. తను వారిని తెగ ఉద్ధరించేస్తున్నానని చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటం మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులూ గుర్తుకురాని ముస్లింలు ఎన్నికల ముందు చంద్రబాబుకు గుర్తుకు వస్తున్నారు.

ఇక బాబు కేబినెట్లోకి చేరికలు మాత్రమేకాదు… కొన్ని తీసివేతలు కూడా ఉంటాయని అంటున్నారు. పునర్వ్యస్థీకరణలో కొన్ని వికెట్లు పడబోతున్నాయని కూడా అంటున్నారు. ఇలా పదవులను కోల్పోయే మొద‌టి వారిలో మంత్రి భూమా అఖిలప్రియ ఉండబోతోందని సమాచారం.

అఖిలప్రియకు చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవిని ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బాబు పెట్టిన ఒత్తిడికి తాళలేక భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పాలయితే… ఎలాగూ నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయనే లెక్కలతో, సానుభూతిని వాడుకోవచ్చని చంద్రబాబు నాయుడు అఖిలప్రియకు మంత్రి పదవిని ఇచ్చాడ‌న్న సంగ‌తి తెల‌సిందే.

ఇప్పుడైతే అఖిలప్రియతో బాబుకు దాదాపుగా అవసరం తీరిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మంత్రిగా కూడా అఖిలప్రియ పనితీరు ఎలా ఉందో ప్రజలు కూడా చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అఖిలను తప్పించినా అడిగే వారు ఉండరనే కాన్ఫిడెన్స్ చంద్రబాబుకు ఎలాగూ ఉండనే ఉంది.

నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల విషయంలో బాబు తదుపరి లెక్కల కోణం నుంచి చూసినా.. అఖిలప్రియకు ప్రాధాన్యత చాలావరకూ తగ్గబోతోంది. ఒక వేల కేబినేట్ నుంచి తొల‌గిస్తే అఖిల భ‌విష్య‌త్తు అగమ్య‌గోచ‌రం అవుతుంది. ఒక వేల వేరే పార్టీలోకి వెల్లాల‌నుకున్నా వైసీపీ, లేదా జ‌న‌సేన పార్టీలు మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తున్నాయి. వైసీపీ వ‌ద్దంటే అఖిల జ‌న‌సేన‌లో చేర‌డం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -