Monday, May 20, 2024
- Advertisement -

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మిస్సింగ్.. సూసైడ్ నోట్.. నేతల టెన్షన్!

- Advertisement -

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం మహాగర్జనకు సర్వం సిద్ధమైన వేళ.. శ్రీనివాసరావు అనే ప్లాంట్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ రాసిన లేఖ కలకలం రేపుతోంది. గాజువాకకు చెందిన శ్రీనివాసరావు.. ఉక్కు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతవుతానంటూ రాసిన లేఖ లభ్యమైంది. ఈ లేఖపై పోలీసులు, కార్మికులు వివరాలు సేకరిస్తున్నారు. శ్రీనివాసరావు ఉదయం 5 గంటల షిఫ్ట్‌కు ప్లాంట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

విశాఖ ఉక్కు కార్మికుడి ఆత్మహత్య లేఖపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్.. కేసుల మాఫీ ప్రయత్నాల వల్లే కార్మికుడు సూసైడ్ నోటు రాసే దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా పోరాడతామని చెప్పారు. ప్రాణత్యాగాలు చేసుకునే నిర్ణయాలు తీసుకోవద్దని ఉక్కు కార్మికులను లోకేశ్ కోరారు.

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ చూస్తే బాధ కలిగిందన్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని… ఉక్కు కార్మికులకు టిడిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కార్మిక కుటుంబాల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనను సీఎం జగన్ అర్థంచేసుకోవాలని కోరారు. కార్మికులు ప్రాణత్యాగాలు చేసే నిర్ణయం తీసుకోవద్దని, దయచేసి మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాయడం బాధాకరమని, పోలీసులు అతడి ఆచూకీ తెలుసుకుని రక్షించాలని గంటా కోరారు.

స్టీల్ ప్లాంట్ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని…మీకు మేం ఉన్నామంటూ శ్రీనివాసరావుకు భరోసా ఇచ్చారు. అలానే శ్రీనివాసరావు ఆవేదనను అందరూ గుర్తించాలని ఆయన కోరారు. ఆత్మ బలిదానాలు వృథా కారాదని, తాను కూడా అగ్నికి ఆహుతై బలిదానం చేస్తానని, తన ప్రాణత్యాగంతో మళ్లీ ఉక్కు గర్జన ప్రారంభం కావాలని శ్రీనివాసరావు తన లేఖలో పేర్కొన్నాడు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పాక్ ప్రధానికి ఇమ్రాన్‌ఖాన్ కరోనా పాజిటీవ్!‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి గెలుపు!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్ర‌యివేటుకు ఇసుక తవ్వకాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -