Sunday, April 28, 2024
- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి గెలుపు!

- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా  ఉత్కంఠభరితంగా సాగుతున్న తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చేరుకుంది.  మొత్తానికి  హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించారు.  బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రెండోస్థానానికే పరిమితమయ్యారు. మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కే.నాగేశ్వర్, నాలుగో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి నిలిచారు.

వాణీదేవికి మొత్తం 1,49,269 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689, రెండో ప్రాధాన్యత ఓట్లు 36,580 వచ్చాయి. ఆమె విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, టీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాల్లో వాణీదేవి విజయం సాధించినట్టు ప్రకటించుకుంది.  పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపుతో ఆమెకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది.

పాక్ ప్రధానికి ఇమ్రాన్‌ఖాన్ కరోనా పాజిటీవ్!‌

ఫిట్‌నెస్‌ లో పాస్ అయితే.. ఇంత క్లాస్ ఇవ్వాలా నటరాజన్‌..!

వంద రోజుల్లోనే వేల కొద్దీ అనుమతులు: కేటీఆర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -