Tuesday, May 14, 2024
- Advertisement -

కృష్ణాజిల్లాలో వైసీపీ అభ్య‌ర్థుల విజ‌యంపై జ‌గ‌న్ సర్వే!!

- Advertisement -

2019లో జ‌రిగే ఎలెక్ష‌న్స్‌లో ఎట్టి ప‌రిస్థితుల‌లో అధికారంలో రావ‌డానికి ఇటు అధికార ప‌క్షం, అటు ప్ర‌తిప‌క్షం రెండు పార్టీలు విశ్వప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.ఇక ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎలెక్ష‌న్స్ ఒక‌సారి ప‌రిశీలిస్తే కృష్ణాజిల్లాలో ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు గెలుస్తుందో, ఆ పార్టీయే అధికారంలోకి రావ‌డం జ‌రుగుతుంది.అందుకే ఆ రెండు పార్టీలు ఇప్ప‌డు ఈ జిల్లా మీద ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం.అందులోని భాగంగా వైఎస్‌.జ‌గ‌న్ కృష్ణాజిల్లాలో గెలుపు గుర్రాలును బ‌రిలో నిల‌పాల‌ని భావిస్తున్నాడు.

కృష్ణాజిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజిక వ‌ర్గాలు ఉన్నాయి. 2014లో జ‌రిగిన ఎలెక్ష‌న్స్‌లో 10 టీడీపీ,5 వైసీపీ,1 బీజేపీ గెలిచింది. 019 ఎలెక్ష‌న్స్‌లో కృష్ణాజిల్లాలో వైసీపీ జెండా ఎగ‌ర‌ల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు.అందుక‌నే అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆచి తుచి అడుగులు వేస్తున్న‌ట్లుంది. ఒక్క‌సారి 2019 ఎలెక్ష‌న్స్‌లో వైసీపీ అభ్య‌ర్థులు ఎవ‌రో చూద్దాం!

తిరువూరు: ఇక్క‌డ ప్ర‌స్తుత ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి వైసీపీనే.ఇత‌ను గ‌త ఎన్నిక‌ల‌లో త‌క్కువ ఓట్లతో గెలిచిన‌ప్ప‌టికి పార్టీ మార‌కుండా జ‌గ‌న్ ని న‌మ్ముకుని ఉండ‌టంతో మ‌రోసారి ర‌క్ష‌ణ నిధికే తిరువూరు టిక్కెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది.ఇక్క‌డ టీడీపీ అభ్యర్థి కూడా బ‌లంగా ఉండ‌టంతో వైసీపీ కొంచెం క‌ష్ట‌ప‌డాల్సి ఉంది.

నూజివీడు :ఇక్క‌డ ప్ర‌స్తుత ఎమ్మెల్యే మేకా వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు వైసీపీనే. 2014లో జరిగిన ఎన్నిక‌లో 10 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచాడు. ప్ర‌తాప్ అప్పారావు పార్టీ మార‌తరానే చ‌ర్చ న‌డిచిన ఈయ‌న పార్టీ మార‌లేదు.ఇక 2019లో ప్ర‌తాప్ అప్పారావుకే టిక్కెట్ ఖ‌చ్చితంగా ఇచ్చే చాన్స్ ఉంది.ఇక టీడీపీకి స‌రైన అభ్య‌ర్థి లేక‌పోవ‌డం పెద్ద దెబ్బ‌.

గుడివాడ: ఈ నియోజిక వ‌ర్గం గ‌తంలో టీడీపీకి మంచి ప‌ట్టు ఉంది.అయితే కొడాలి నాని పార్టీ మార‌డంతో ఇక్క‌డ టీడీపీకి పెద్ద దెబ్బ‌. గ‌త ఎన్నిక‌ల‌లో నాని వైసీపీ పార్టీ నుండి పోటీ చేసి 10 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచాడు. ఇక్క‌డ టీడీపీ కేడ‌ర్ బ‌లంగానే ఉన్నా ఇక్క‌డ స‌రైన లీడర్ లేక‌పోవ‌డం టీడీపీకి లోటే అని చెప్పాలి. ఇక్క‌డ మ‌రోసారి వైసీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

గన్న‌వ‌రం : కృష్టాజిల్లాలో ముఖ్య‌మైన నియోజిక వ‌ర్గంలో ఇది ఒక‌టి.2014 జ‌రిగిన ఎలెక్ష‌న్స్‌లో వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీ అభ్య‌ర్థిపై విజ‌యం సాధించారు.ఇక్క‌డ వైసీపీకి కేడ‌ర్ ఉన్నా లీడ‌ర్ లేడ‌ని వారు ఆరోపిస్తున్నారు. ఇక్క‌డ పార్టీ ఇన్‌చార్జీగా ఉన్న‌  దుట్ట రామ‌చంద్ర‌రావుకే మ‌ళ్లీ ఈయ‌న‌కే టిక్కెట్ ఇస్తే గెల‌వ‌డం క‌ష్టం అంటున్నారు పార్టీ వ‌ర్గాలు. ఇక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థిని పెట్టే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తుంది.గ‌న్న‌వ‌రంలో టీడీపీ బ‌లంగా ఉంది.

కైక‌లూరు :ఈ నియోజిక వ‌ర్గంలో వైసీపీ బ‌ల‌హీనంగా ఉంది.గ‌త ఎన్నిక‌ల‌లో 20 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్య‌ర్థి ఓడిపోవ‌డం బ‌ట్టి చూస్తే అర్థం అవుతుంది.ఇక్క‌డ వైసీపీ ప‌రిస్థితి ఏంటో. కైక‌లూరులో వైసీపీ పార్టీ ఇన్‌చార్జీగా ఉప్ప‌ల రామ్ ప్ర‌సాద్ ఉన్నాడు. ఈయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు పార్టీ వ‌ర్గాలు. జ‌గ‌న్ ఇక్క‌డ ఆర్థిక బ‌లం ఉన్న నేత కోసం వెతుకుతున్నారు. ఇక్క‌డ టీడీపీ బ‌లంగా ఉంది.

పెడ‌న : 2014లో జ‌రిగిన ఎలెక్ష‌న్స్‌లో టీడీపీ అభ్య‌ర్థి కాగిత‌పు వెంక‌ట్రావు ఇక్క‌డి నుండి విజ‌యం సాధించారు.బిసిలు ఎక్కువుగా ఉండే నియోజిక వ‌ర్గం పెడ‌న‌.ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిని మార్చేశాడు జ‌గ‌న్‌.బిసి నాయ‌కుడు అయిన జోగి ర‌మేష్‌ని ఈ నియోజిక వ‌ర్గం నుండి బ‌రిలో దింపాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు.ఇక్క‌డ టీడీపీకి వైసీపీకి స‌మాన ఇమేజ్ ఉండ‌టంతో వ‌చ్చే ఎలెక్ష‌న్స్ ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.

మ‌చిలిప‌ట్నం :ఈ నియోజిక వ‌ర్గంలో వైసీపీ కాస్తా బ‌ల‌హీనంగానే ఉంది.అయిన‌ప్ప‌టికి గ‌త ఎన్నిక‌ల‌లో ఓట‌మి పాలైన వెంక‌ట రామ‌య్య‌కే టిక్కెట్ ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి కొల్లు ర‌వింద్ర‌ ఆర్థికంగా సంప‌న్నుడు కావడంతో వ‌చ్చే ఎలెక్ష‌న్స్‌లో వైసీపీ అభ్య‌ర్థి క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

అవ‌నిగ‌డ్డ :ఇక్క‌డ వైసీపీ పార్టీ చాలా బ‌లంగా ఉంది.గ‌త ఎన్నిక‌ల‌లో టీడీపీ అభ్య‌ర్థి తక్కువ ఓట్ల‌తో విజ‌యం సాధించారు.2019లో జ‌రిగే ఎలెక్ష‌న్స్‌లో వైసీపీ పార్టీ త‌రుపున సింహాద్రి రమేష్ పోటీ చేస్తార‌ని స‌మాచారం.ఇక్క‌డ టీడీపీ బ‌ల‌హీనంగానే ఉంది.

పామ‌ర్రు : గ‌త ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించిన వైసీపీ అభ్య‌ర్థి ఉప్పులేటి క‌ల్ప‌న టీడీపీలో మారిన సంగ‌తి తెలిసిందే.ఇక్క‌డ వైసీపీకి స‌రైన నాయ‌క‌త్వం లేదు కాని కేడ‌ర్ మాత్రం బలంగా ఉంది.ఇక్క‌డ అభ్య‌ర్థి కోసం వైసీపీ వెతుకుంది.ఇక్క‌డ టీడీపీ ప‌రిస్థితి అంత‌గా బాలేద‌నే చెప్పాలి.టీడీపీ త‌రుపున వ‌ర్ల రామ‌య్య బ‌రిలో నిలిచే అవ‌కాశం ఉంది.

పెన‌మలూరు: ఈ నియోజిక వ‌ర్గం మొద‌టి నుంచి టీడీపీకి మంచి ప‌ట్టుంది.గ‌త ఎన్నిక‌ల‌లో ఇక్క‌డి నుండి టీడీపీ అభ్య‌ర్థి బొడె ప్ర‌సాద్ 30 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారంటే ఇక్క‌డ వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.ఈ నియోజిక వ‌ర్గంలో వైసీపీకి లీడ‌ర్,క్యాడ‌ర్ రెండు లేవు.ఇక్క‌డ టీడీపీ విజ‌యం ప‌క్క‌.

విజ‌య‌వాడ ప‌శ్చిమ: గ‌త ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించిన వైసీపీ అభ్య‌ర్థి జ‌లీల్ ఖాన్ టీడీపీ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే.ఇక్క‌డ నుండి వైసీపీ అభ్య‌ర్థిగా వెల్లంప‌ల్లిని బ‌రిలో దింపాల‌ని వైసీపీ భావిస్తుంది.ఇక్క‌డ వైసీపీ క్యాడ‌ర్ బ‌లంగానే ఉంది.

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ :2014 ఎన్నిక‌ల‌లో సెంట్ర‌ల్ నియోజిక వ‌ర్గం నుండి టీడీపీ అభ్య‌ర్థి బొండా ఉమ విజ‌యం సాధించారు.ఈసారి ఎలెక్ష‌న్స్‌లో వంగ‌వీటి రాధా కాని,మల్లాది విష్ణు కాని వైసీపీ నుండి బ‌రీలో దిగే అవ‌కాశం ఉంది.ఇక్క‌డ టీడీపీ బ‌లంగానే ఉంది.

విజ‌యవాడ ఈస్ట్ :ఇక్క‌డి నుండి గ‌త ఎన్నిక‌ల‌లో టీడీపీ అభ్య‌ర్థి గ‌ద్దె రామ్మోహ‌న్ రావు విజ‌యం సాధించారు.ఈసారి ఈయ‌న గెలుపును ఆప‌డానికి య‌ల్ల‌మంచిలి ర‌విని బ‌రిలో నిల‌పాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. గ‌ద్దె రామ్మోహ‌న్ రావుని ఓడించిన చ‌రిత్ర ఎల్ల‌మంచిలి ర‌వికి ఉంది.

మైల‌వ‌రం: ఈ నియోజిక వ‌ర్గంపై జ‌గ‌న్ దృష్టి సారించినట్లుంది.ఎందుకంటే చంద్ర‌బాబుకి న‌మ్మిన బంటు అయిన దేవినేని ఉమ నియోజిక వ‌ర్గం ఇదే.దీంతో ఇక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బ‌ట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడు జ‌గ‌న్‌.గ‌త ఎన్నిక‌ల‌లో త‌క్కువ ఓట్ల‌తో విజ‌యం సాధించాడు ఉమ‌.ఈసారి గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే ఉమ‌ని ఓడించ‌డం పెద్ద ప‌ని కాద‌ని భావిస్తున్నారు.దీనిలో భాగంగానే ఇక్క‌డ నుండి వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌ని బ‌రిలోకి దింపుతున్నాడు జ‌గ‌న్‌.గ‌త ఎన్నిక‌ల‌లో ఇక్క‌డి నుండి పోటీ చేసిన జోగి ర‌మేష్‌ను పెడ‌న నుండి పోటీ చేయించాల‌ని జ‌గన్ ఆలోచ‌న‌.

నందిగామ : ఇక్క‌డ మొద‌టి నుండి టీడీపీకి మంచి ప‌ట్టుంది. అయితే గ‌త ఎన్నిక‌ల‌లో టీడీపీ అభ్య‌ర్థిపై వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించినంత ప‌ని చేశాడు.దీంతో గ‌త ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన అభ్య‌ర్థి అయిన జ‌గ‌న్మోహ‌న్ రావుకే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది.

జ‌గ్గ‌య్య‌పేట : ఇక్క‌డి నుండి గ‌త ఎన్నిక‌ల‌లో వైసీపీ త‌రుపున పోటీ చేసి ఓడిపోయారు సామినేని ఉద‌య‌భాను.త‌క్కువ ఓట్ల‌తో ఓడిపోవ‌డం,కాపు నాయ‌కుడు కావడంతో వ‌చ్చే ఎలెక్ష‌న్స్‌లో కూడా వైసీపీ నుండి ఉద‌య‌భానే పోటీ చేసే అవ‌కాశం ఉంది.ఇక్క‌డ వైసీపీ బలంగానే ఉంది.

ఇవ్వ‌న్ని ఇప్ప‌టి వ‌రకు ఉన్న నాయ‌కుల బ‌ల‌బ‌లాలు మీద‌ ఉన్న‌దాని బట్టి జ‌రిగింది.ఎలెక్ష‌న్స్‌ లోపు నాయ‌కుల ప్ర‌తిభ‌ను బ‌ట్టి టిక్కెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -