Saturday, May 4, 2024
- Advertisement -

ఆ భయంతోనే పవన్ పెళ్లిళ్లు, పెళ్లాలపై కామెంట్స్

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, పెళ్లాల గురించి వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏదో అలవాటులో పొరపాటుగా వచ్చేయలేదు. పక్కాగా స్కెచ్ వేసుకునే, బాగా ఆలోచించే జగన్ పవన్ ను ఉతికి ఆరేశాడు. అవిశ్వాసం పెట్టండి. ఎంపీలు రాజీనామా చేయండి. మోడీని ప్రశ్నించండి. నేను మద్దతిస్తా, అని రెచ్చగొట్టి పారిపోతున్న పవన్, ప్రతిసారి జగన్ ను, ఆయన పార్టీని టార్గెట్ చేస్తున్నాడు. నాకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా మోడీని ప్రశ్నించి, హోదా సాధించేవాడిని, జగన్ కు అంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా ఏం లాభం.

ఆయనకు జైలు భయం, కేసుల భయం అంటూ జగన్ గాలి తీసేస్తున్నాడు పవన్. వీటిపై చాలా రోజులుగా జగన్ సంయమనంతో వ్యవహరించాడు. పవన్ అంటే గాలి అని అర్ధం. సో పవన్ మాటలు కూడా గాలిమాటలే అనే లెక్కలో తీసిపారేశాడు. కానీ పవన్ రోజురోజుకూ విమర్శల దాడి పెంచేస్తున్నాడు. మొన్నటి వరకూ అధికారం అక్కర్లేదు. కానీ పోటీ చేస్తాం.. అని చెప్పుకొచ్చిన పవన్ ఈ మధ్య అధికారం ఇచ్చి చూడండి, అది చేసేస్తా, ఇది చేసేస్తా..అని వాళ్లన్నయ్య చిరంజీవి గతంలో చెప్పిన డైలాగులే చెప్పేస్తున్నాడు.

పవన్ స్వరంలో మార్పును జగన్ పరిశీలించాడు. ప్రశ్నంచడానికే పార్టీ పెట్టాను, ఎన్నికల్లో పోటీ చేస్తాను. అధికారం తుచ్ఛం, నీచం అని నిన్నటి వరకూ చెప్పుకొచ్చిన పవన్ ఇప్పుడు అధికారం కోసం అర్రులు చాస్తున్నాడని జగన్ కు అర్ధమైపోయింది. తన తండ్రి మరణించినప్పటి నుంచీ తాను సీఎం సీటు కోసం చేయని ప్రయత్నం లేదు. కానీ కాలం కలిసి రావట్లేదు. ఈ సారి కానీ ఆ అవకాశం దక్కించుకోలేక పోతే ఇక జగన్, ఆయన పార్టీ రాజకీయ భవిష్యత్ అంధకారమే. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినా, అధికారంలోకి వచ్చే చాన్స్ ఉందో, లేదో అనే టెన్షన్ జగన్ ను వెంటాడుతోంది. పవన్ కళ్యాణ్ పార్టీకి ఐదో, పదో సీట్లు వచ్చినా, తనను అడ్డుకోవడానికి చంద్రబాబు దేనికైనా తెగిస్తాడు. కనుక టీడీపీ మద్దతు పవన్ కి ఇచ్చి, ఆయనను సీఎం సీట్లో కూర్చో బెట్టే అవకాశాలూ ఉన్నాయి.

మొన్న కర్నాటకలో అత్యధిక సీట్లు గెల్చుకున్న బీజేపీని తొక్కి పెట్టి, తక్కువ సీట్లు వచ్చిన కుమారస్వామి పార్టీకి మద్దతు ఇచ్చి, ఆయనను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసినట్లు సోనియా, చంద్రబాబు తనను తొక్కిపెట్టి, పవన్ కు మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సోనియా, చంద్రబాబు ఉమ్మడి శత్రువు జగన్. తనను ఎదిరించి పార్టీ పెట్టి, సీఎం అయ్యాడు అనే ఘనత జగన్ కు దక్కకూడదనేది సోనియా ఆలోచన. ఎటూ చంద్రబాబు జగన్ సీఎం కాకూడదని సవాలక్ష ఎత్తులు వేస్తుంటాడు. టీడీపీ కానప్పుడు, ఎవరైనా ఓకే కానీ, జగన్ మాత్రం అధికారం చేపట్టకూడదు.

అన్నది బాబు ఆలోచన. సో 2019లో నాలుగైదు సీట్లు వచ్చినా పవన్ ను ముఖ్యమంత్రి పీఠంపై టీడీపీ, కాంగ్రెస్ కూర్చోబెట్టే ప్రయత్నాలు చేస్తాయి. అదే జరిగితే పవన్ వల్ల తన రాజకీయ జీవితానికే చరమగీతం పాడే అవకాశాలున్నాయి. అందుకే అవన్నీ ఆలోచించే జగన్ పవన్ వ్యక్తిత్వాన్ని, ఆయన బహుభార్యత్వాన్ని, చీల్చి చెండాడాడు. పది సీట్లు కాదు కదా…ఒక్క సీటు కూడా పవన్ పార్టీ గెల్చుకోకుండా ఇప్పటి నుంచే అటాక్ చేస్తే…తనకు టెన్షన్ ఉండదు అని భావించే తీవ్ర విమర్శలు చేశాడు. మొత్తానికి ఆలస్యంగా ఇచ్చినా పవన్ కు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు జగన్. ఇకపైనా ఆయన ఆయన పార్టీ నేతలు ఇదే దూకుడు ప్రదర్శిస్తే పవన్ తమను విమర్శించడం పక్కనపెట్టి, తనపై వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోలేకే కిందామీదా పడతాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -