Sunday, May 5, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియాలో గోదావ‌రి జిల్లాల‌ స‌ర్వే…వైసీపీకీ ఎన్ని సీట్లంటే….?

- Advertisement -

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు యుద్ధాన్ని త‌ల‌పించ‌నున్నాయి. అధికార పీఠంకోసం పార్టీల మ‌ధ్య తీవ్ర పోరు జ‌రుగుతుంద‌న‌డంలో సందేహంలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని స‌ర్వేలు వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చేశాయి. అయితే అధికారంలోకి రావాలంటే ప్ర‌ధానంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఏపార్టీ అయితే అధిక సీట్లు సాధిస్తుందో ఆ పార్టీదే అధికార పీఠం. అందుకే అన్ని రాజ‌కీయ పార్టీలు ఆ రెండు జిల్లాలపైనే దృష్టి పెట్టాయి.

గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారం కోల్పోవ‌డానికి ఆ రెండు జిల్లాలే ప్ర‌ధాన‌కార‌ణం. అందుకే భాజాపా, ప‌వ‌న్ స‌పోర్టుతో బాబు అధికారంలోకి వచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా…జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మాత్రం నేనే సీఎం అవుతా…నేనే కింగ్ మేక‌ర్ అని ధీమాతో ఉన్నారు. ఎందుకంటే రెండు జిల్లాల్లో కాపు ఓట్లు ఎక్క‌వ కాబ‌ట్టి వీలైన‌న్ని సీట్లు సాధింవ‌చ్చ‌ని ప‌వ‌న్ అభిప్రాయం.

అయితే సీన్ మాత్రం రివ‌ర్స్ అవుతోంది. వైసీపీ వైపు గెలుపు ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అధ్యయన సంస్థ ఈ జిల్లాల్లో రాజకీయ పరిస్థితి గురించి సంచలన సర్వేను ప్రకటించింది. దీనిలో ఎంత నిజం ఉందో గాని… గోదావరి జిల్లాల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడే అవకాశం ఉందని అలాగే జనసేన కు చావు దెబ్బ తప్పదని ఈ సర్వే చెబుతోంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో కలిసి టీడీపీ మూడంటే మూడు అసెంబ్లీ సీట్లలో మాత్రమే నెగ్గే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. టీడీపీ ఇలా చిత్తు అయిపోతుందని.. అక్కడ మిగిలిన సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచుకుంటుందని ఈ అధ్యయనం అంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు జిల్లాల్లోనూ కలిసి 20 నుంచి 25 అసెంబ్లీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని మెజారిటీ సీట్లు వైసీపీ దక్కించుకుంటుందని స‌ర్వే స్ప‌ష్టం చేస్తోంది.

ఈ రెండు జిల్లాలపై ప‌వ‌న్ పెట్టుకున్న ఆశ‌లు గ‌ల్లంత‌వ‌డం ఖాయం. జ‌న‌సేన‌కు గట్టిగా మూడు నాలుగు సీట్ల కంటే ఎక్కువ గా వచ్చే అవకాశం లేదంటా .. ఈ అధ్యయనం అంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ రెండు జిల్లాల్లో 20 నుంచి 25 సీట్లే గనుక వస్తే.. అధికారం దాదాపు హస్తగతం అయినట్టే. ప‌వ‌న్ మాత్రం ఆ రెండు జిల్లాల‌ను వ‌దిలి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు ప‌న్నినా అధికార పీఠం మాత్రం వైసీపీదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -