Saturday, April 20, 2024
- Advertisement -

ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

- Advertisement -

మన రోజువారి జీవితంలో పాలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. ఒక రోజు పాలు లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు పాలు అవసరం ఎంతగానో ఉంటుంది. పెద్దలకు కాఫీ, టీ పిల్లలకు మిల్క్ షేక్, పాలు అవసరం ఎంతగానో ఉంది. అయితే ప్రస్తుతం మనకు పాలు కావాలంటే మార్కెట్లో వివిధ రకాల పాలు ప్యాకెట్ రూపంలో మనకు లభ్యమవుతున్నాయి. ఈక్రమంలోనే ఏ పాలు ఎంతవరకు సురక్షితం? వేటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయనే విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం..

మనకు మార్కెట్లో వివిధ రకాల పాలు అందుబాటులో ఉన్నాయి అవి ఒకటి కార్టన్ మిల్క్, పచ్చి పాలు, ప్యాకెట్ మిల్క్, ఆర్గానిక్ మిల్క్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో ఏవి మంచివి అనే విషయాలను తెలుసుకుందాం.


కార్టన్ మిల్క్: ఈ కార్టన్ మిల్క్ నే టెట్రా ప్యాక్‌ మిల్క్ అని కూడా పిలుస్తారు. ఈ విధమైనటువంటి పాలు అల్ట్రా హై టెంపరేచర్ లో కొన్ని సెకన్ల పాటు వేడి చేసి వెంటనే చల్లబరిచి వీటిని ప్యాక్ చేస్తారు. ఇలా చేయటం వల్ల వీటిలో ఎలాంటి ఆర్గానిజమ్స్, ప్యాథోజెన్స్ ఉండవు.

Also read:వార్ని.. సీరియల్ నటి కూడా మ్యాటర్ అంటూ డైలాగులు వేసిందిగా!

పచ్చి పాలు: పచ్చి పాలు అంటే పాశ్చరైజ్ చేయని పాలు. ఈ విధమైనటువంటి పాలు బయట మనకు ఎంతో మంది పల్లెల నుంచి తీసుకువచ్చి అమ్ముతుంటారు.అయితే మనకు పాల క్వాలిటీతో సంబంధం లేకపోతే పచ్చిపాలు ఎంతో సురక్షితం అని చెప్పవచ్చు.

ఆర్గానిక్ మిల్క్: ప్రస్తుతం చాలామంది ఎక్కువగా ఆర్గానిక్ పదార్ధాలను తినడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పాలను సైతం ఆర్గానిక్ పాలు త్రాగడానికి ఇష్టపడుతున్నారు.ఆర్గానిక్ పాలు అంటే మనం పండించే పంటలకు ఎలాంటి క్రిమిసంహారక మందులను ఉపయోగించకుండా సహజ పద్ధతిలో పండించే వాటిని ఆర్గానిక్ పంటలు అని చెబుతారు.ఈ విధంగానే పశువులకు వేసే గడ్డిని కూడా ఏ మందులు వేయకుండా పండించడం అదేవిధంగా పశువులకు ఎలాంటి హార్మోన్ ఇంజెక్షన్లను ఇవ్వకుండా తయారు చేసే పాలనే ఆర్గానిక్ పాలు అంటారు.

ప్యాకెట్ పాలు: ప్రస్తుతం మార్కెట్లో మనకు విరివిగా లభించే వాటిలో ప్యాకెట్ పాలు ఒకటి. ఈ ప్యాకెట్ పాలను ఒక టెంపరేచర్ వద్ద పాశ్చరైజ్ చేయబడతాయి. ఇందు వల్ల పాలలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ నశించిపోతాయి అన్న నమ్మకం లేదు. అందుకోసమే ప్యాకెట్ పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు.

Also read:ప్లీజ్… 40 రూపాయిలు ఇవ్వండంటున్న రాశీ ఖన్నా!

ఈ విధమైనటువంటి పాలలో ఎక్కువగా కార్టన్ లేదా టెట్రా ప్యాక్ పాలు ఎంతో సురక్షితం అని చెప్పవచ్చు.ఈ పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయటం వల్ల ఇందులో ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉండవు కనుక వీటిని ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచుకొని తాగవచ్చు. ఇకపోతే మనకు క్వాలిటీతో సంబంధం లేకుండా సురక్షితమైన పాలు కావాలనుకుంటే పచ్చి పాలు ఎంతో శ్రేష్టం. కేవలం ఇరవై నాలుగు గంటలలోపు పాలను వాడాలనుకొనే వారు ప్యాకెట్ పాలను కొనుగోలు చేయవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -