Wednesday, May 8, 2024
- Advertisement -

బాబుకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే షాక్…. టిడిపిలో 13మంది జగన్ కోవర్ట్స్… నెక్ట్స్ ఇయర్ జంపింగ్‌కి సూపర్ ముహూర్తం

- Advertisement -

వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టిడిపిలోకి జంప్ చేశారు. చంద్రబాబు కండువా కప్పే టైంలో షరా మామూలుగానే ఇప్పటి వరకూ జంపింగ్ బ్యాచ్ అందరూ చేసినట్టుగానే మెలా డ్రామా పండించడానికి కూడా బ్రహ్మాండంగా ప్రయత్నం చేశారు. అయితే నారా లోకేష్ ప్రభావమో ఏమోకానీ గడ్డి ఈశ్వరి తడబడిపోయి ఏజెన్సీ మొత్తం వైకాపా స్వీప్ చే్స్తుందని చెప్పడంతో చంద్రబాబుతో సహా టిడిపి నేతలందరూ షాక్ అయ్యారు. అది కూడా ఆ ఒక్క మాట మాట్లాడి ఉంటే పెద్దగా సమస్య అయి ఉండేది కాదు. కానీ ఏజెన్సీ జనాలకు వైఎస్ ఎంతో మేలు చేశాడని, ఏజెన్సీ ప్రజలు వైఎస్ చేసిన మేలు మర్చిపోరని 2019లో కూడా వైకాపా స్వీప్ చేస్తుందనే స్థాయిలో మాట్లాడిన గడ్డి ఈశ్వరి మొదటి రోజే బాబుగారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇక ఆ మధ్య ఏజెన్సీలో ఘనులను అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని బాబుగారు ప్రయత్నించినప్పుడు ఇదే గడ్డి ఈశ్వరి…చంద్రబాబు తలను నరుకుతాం అనే స్థాయి భారీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడు పార్టీ మారిన సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తే… ‘ఇప్పటికీ నేను ఆ మాట మీద నిలబడి ఉన్నానని… ఏజెన్సీ జోలికొస్తే అదే జరుగుతుందని’ హెచ్చరికలాగా చెప్పడంతో బాబు అండ్ కోకు ఏం చేయాలో కూడా తెలియలేదు.

ఆ విషయం అలా ఉంటే వైకాపాకు రాజ్యసభ సీటు దక్కకుండా చేయడం కోసమే నానా తిప్పలూ పడి… కోటాను కోట్ల రూపాయల ఖర్చుతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి తెరతీసిన చంద్రబాబుకు ఇప్పుడు దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వైకాపాకు రాజ్యసభ సీటు దక్కే ఛాన్సే లేదన్న మీడియా వార్తల నేపథ్యంలో టిడిపిలోనే పది నుంచి పదిహేను మంది జగన్ కోవర్టులు ఉన్నారన్న విషయం మీడియా సర్కిల్స్‌లో గుప్పుమంటోంది. 2018లో జగన్ పాదయాత్ర ముగిసేనాటికి వాళ్ళందరూ కూడా జగన్‌కి సపోర్ట్‌గా నిలబడతారని చెప్తున్నారు. అలాగే రాజ్యసభ ఎన్నికల్లో కూడా వైకాపాకు అనుకూలంగా ఓటు వేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తకు బలం చేకూరుస్తూ జెసీ దివాకర్‌రెడ్డిలాంటి వాళ్ళ మాటలు ఉండడం గమనార్హం. జేసీల కుటుంబం నుంచీ, ఆనం బ్రదర్స్ కుటుంబాల నుంచి మెయిన్ హెడ్స్ టిడిపిలో ఉన్నప్పటికీ యువ నాయకులు మాత్రం వైకాపాతో ఉన్నారన్న విషయం తెలిసిందే. జేసీల కుటుంబం నుంచి ఒక యువనాయకుడు 2019లో జగన్ పార్టీ తరపున పోటీ చేయడం కూడా ఖాయమని చెప్తున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి రిటైర్ కావడం ఖాయం. ఆ విషయాల గురించే మీడియా జేసీ దగ్గర ప్రస్తావించినప్పుడు..‘జగన్ కూడా మావాడే…..చంద్రబాబును ఎదుర్కునే సత్తా జగన్‌కి మాత్రమే ఉంది’ అని అంటూ జేసీ మాట్లాడిన మాటలు ఇప్పుడు టిడిపి నేతల అంతర్గత చర్చల్లో కూడా హాట్ హాట్‌గా ప్రస్తావనకు వస్తున్నాయి. తలను నరుకుతానన్న గడ్డి ఈశ్వరినే పార్టీ మారగా లేనిది ఇక జేసీలు పార్టీ మారడం పెద్ద విషయమేం కాదని విశ్లేషకులు చెప్తున్నారు. టిడిపిలో జేసీలు అసంతృప్తితో ఉన్నారన్న మాట మాత్రం అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా జగన్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారట.

అయితే అధికారాన్ని వదులుకోవడం ఇష్టం లేక 2019ఎన్నికల నాటికి వస్తామని చెప్తున్నారట. అయితే జగన్‌కి సపోర్ట్‌గా ఉన్న టిడిపి ఎమ్మెల్యేలు వైకాపాకు రాజ్యసభ సీటు గెల్చుకోవడానికి కావాల్సిన మెజారిటీ లేకపోతే మాత్రం కచ్చితంగా వైకాపాకు మద్ధతిచ్చే అవకాశం ఉందని మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. అదే జరిగితే మాత్రం ఎన్నికల ఏడాదిలో చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగలడం ఖాయం. ఆ తర్వాత మూడున్నరేళ్ళుగా చంద్రబాబు నడిపిస్తున్న అనైతిక ఫిరాయింపుల గేం మొత్తం బూమరాంగ్ అయి చంద్రబాబుకి తల బొప్పి కట్టించడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే పాదయాత్ర ముగింపు సమయానికి వైఎస్ జగన్ ఏ మేరకు ప్రజాదరణను పెంచుకుంటాడు అనే విషయాన్ని బట్టి ఈ మొత్తం పరిణామాలు ఆధారపడి ఉంటాయి. జగన్ కచ్చితంగా అధికారంలోకి వస్తాడు అన్న నమ్మకం వస్తే మాత్రం వైకాపాలోకి ఫిరాయింపులు, జంపింగ్‌లు ఓ స్థాయిలో ఉంటాయని చెప్పడానికి సందేహించక్కర్లేదు అన్నది మాత్రం నిజం. ప్రస్తుతానికి అయితే జగన్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. జగన్ పాదయాత్రకు వస్తున్న జనాలను అడ్డుకోవడానికి తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ భజన మీడియా చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ అవడం లేదు. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -