Wednesday, May 15, 2024
- Advertisement -

పాదాలకు సరైన వ్యాయామం ఉండాలి!

- Advertisement -

మీలో చాలామంది పాదాలను పట్టించుకోరు. ముఖానికి ఇచ్చినంత ప్రాముఖ్యత పాదాలకు ఇవ్వరు. అప్పుడప్పుడు పెడిక్యూర్‌ వంటివి చేయించుకుంటారు. కానీ అదొక్కటే సరిపోదంటున్నారు నిపుణులు. పాదాలను ఆరోగ్యంగా, అందంగా ఉంచేందుకు కొన్ని సలహాలు చెప్పారు.

*పాదాలకు సరైన వ్యాయామం ఉండాలి. అప్పుడే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కాళ్ల నుంచి పైకి రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది. పాదాలమీద పడే ఒత్తిడి 

*వల్ల నాడీవ్యవస్థ చురుగ్గా మారుతుంది. అందుకు ఏం చేయాలంటే..

*చెప్పులు లేకుండా ఇంట్లో నడవడం అలవాటు చేసుకోవాలి. పచ్చిగడ్డి మీద, గరుకుగా ఉండే మట్టి మీద, కార్పెట్ల వంటి వాటి మీద నడవాలి.

*జిమ్‌లో పాదాలకు పనికొచ్చే ప్రత్యేక వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.

*రెండు మూడు రోజులకు ఒకసారి వేడినీళ్లతో పాదాలను శుభ్రం చేసుకోవాలి.

*యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన క్రీములు రాసుకోవాలి.

*తేనె, మెంతులు, పసుపు, అల్లం వంటి మిశ్రమాలను అరికాళ్లకు పూసుకోవచ్చు.

*ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఉపశమనం కలుగుతుంది. పాదాలు అందంగా తయారవుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -