Wednesday, May 22, 2024
- Advertisement -

ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాక్ …

- Advertisement -

కాఫీ తాగనిదే కొందరికి దినచర్య ప్రారంభం కాదు. స్నేహితులు, బంధువులు ఎవర్ని కలిసినా, ‘కుదిరితే కప్పు కాఫీ’ అంటూ అడుగుతుంటాం. చూడచూడ కాఫీ రుచులు వేరయా అన్నట్లు. కాఫీల్లో కూడా చాలా రుచులు ఉంటాయి. కాఫీల్లో అత్యంత ఖ‌రీదైన ఏదో తెలుసా…? దాన్ని త‌యారు చేసె విధానం తెలిస్తే తెలుసుకుంటె షాక్ అవ్వాల్సిందే. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీని మన దేశం తయారు చేస్తోంది.

ఇండోనేషియాలో తయారు చేస్తున్న తరహాలోనే కర్ణాటక రాష్ట్రం కూర్గ్‌ జిల్లాలో కొద్ది మొత్తంలో ఈ కాఫీ తయారవుతోంది. దీన్ని ఓ జంతువు మ‌ళం ద్వారా త‌యారు చేస్తారు. పునుగుపిల్లి కాఫీ గింజ‌ల‌ను ఇష్టంగా తింటుంది. తిన్న కాఫీ కాయ‌ల్లో పై భాగాన్ని జీర్ణించుకోగ‌ల శ‌క్తి మాత్ర‌మే దీనికి ఉంది. జీర్ణ‌క్రియలో భాగంగా మిగిలిపోయిన కాఫీ గింజ‌లు మ‌లం ద్వారా బ‌య‌ట‌కి వ‌స్తాయి. ఆ మ‌లాన్ని సేక‌రించి, శుద్ధి చేసి కాఫీ గింజ‌లను బ‌య‌టికి తీసి, అమ్ముతారు.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ రుచుల్లో ఒకటి. అంతేకాదు అత్యంత పోషకాలు కలిగిన కాఫీ అని కూడా ధ్రువీకరించారు. ఈ కాఫీని ముఖ్యంగా యూరప్‌, గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా కిలో రూ.20,000 నుంచి 25,000 వరకూ ఉంది.

కర్ణాటక కూర్గ్‌లోని అంకుర సంస్థ కూర్గ్‌ కన్సాలిడేటెడ్‌ క‌మొడిటీస్‌‌(సీసీసీ) దీనిని తయారు చేయడం ప్రారంభించింది. ‘సంస్థను ప్రారంభించిన తర్వాత తొలుత 20 కిలోల షివిట్‌ కాఫీని ఉత్పత్తి చేశాం. 2015-16లో 60 కిలోలు, గత సంవత్సరం 200 కిలోల కాఫీని తయారు చేశామ‌ని సీసీసీ తెలిపింది.

విదేశాల్లో షివిట్‌ జాతికి చెందిన పిల్లులను బోనుల్లో బంధించి వాటితో గింజలను తినిపించి కాఫీని తయారు చేస్తున్నారు. కానీ మేము సహజసిద్ధంగా ఎలాంటి బలప్రయోగం లేకుండా కాఫీని తయారు చేస్తున్నారు దేశీయంగా ఈ కాఫీ కిలో రూ.8,000ఉండగా, అంతర్జాతీయంగా రూ.20వేల నుంచి రూ.25వేల వరకూ ఉంది’ అని సీసీసీకి చెందిన హెబర్‌ తెలిపారు. ఈ ప్రత్యేక కాఫీని ‘ఎయిన్‌మానీ’ పేరుతో క్లబ్‌ మహీంద్రా మదికెర రిసార్ట్‌లో విక్రయిస్తున్నారు. ఇక ఆల‌స్యం ఎందుకు వెంట‌నె కాఫీ పొడిని తెచ్చుకొని తాగండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -