Wednesday, May 15, 2024
- Advertisement -

బాబుకు కొత్త క‌ష్టం.. పోటీకి నో అంటున్న నేత‌లు

- Advertisement -

ఏపీలో 25కు 25 లోక్‌స‌భ స్థానాలు గెలుచుకొని జాతీయ రాజ‌కీయాల్లో చక్రం తిప్పాల‌ని ఊవిళ్లూరుతున్న టీడీపీ అధినేత‌కు ఆ పార్టీ నేత‌లు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో తీవ్రంగా చ‌ర్చ న‌డుస్తోంది. కార‌ణం గెలుపుపై విశ్వాసం లేక‌పోవ‌డంతో పోటీ చేయ‌డానికి ముందుకు రాక.. చంద్ర‌బాబు ఎంపిక చేసిన వారు నో చెప్ప‌డానికి తెగ మొహ‌మాట‌ప‌డుతున్నార‌ని చ‌ర్చ న‌డుస్తోంది.

2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ బీజేపీ క‌లిపి పోటీ చేశాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2, వైఎస్ఆర్‌సీపీ 8 లోక్ సభ స్థానాలను గెలుచుకున్నాయి. కానీ ఈ సారి బీజేపీ, తెలుగుదేశం పార్టీలు సొంతంగా పోటీ చేయ‌బోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేశారు. ఏపీని కేంద్రం మోసం చేసింద‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఊద‌ర‌గొడుతున్నారు. దీన్ని కౌంట‌ర్ చేసే స‌త్తా బీజేపీ నేత‌ల‌కు ఏటూ లేదు. వారు గొంతు చిల్చుకొని ఆరిచినా.. ప‌ట్టించుకునే మీడియా మిత్రులు లేరు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని కొంద‌రు నేత‌ల‌కు చంద్ర‌బాబు ఆఫ‌ర్ ఇస్తే మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి అంటూ విముఖ‌త తెలుపుతున్నార‌ట‌. జాతీయ స‌ర్వేల‌తో పాటు నేత‌లు త‌మ సొంతంగా చేసుకున్న స‌ర్వేల నివేదిక‌లు చూస్తుంటే గెలుస్తామ‌నే ఆశ క‌నిపించ‌డం లేద‌ట‌.

ఏపీలో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీల‌ను గెలిపించుకోక‌పోతే జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌లేము.. మీరు ఏదైనా చేయండి గెలుపు మాత్రం మ‌న‌దే కావాలంటూ క్లాస్‌లు పీకుతున్నార‌ని టీడీపీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. కానీ నేత‌లు మాత్రం వెన‌క‌డుగు వేస్తూనే ఉన్నార‌ట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -