Monday, May 20, 2024
- Advertisement -

రేవంత్ అది నీ ఒక్కడితో అయ్యే పనేనా..?!

- Advertisement -

మరి మనది ఎంత కాదనుకొన్నా.. ప్రజాస్వామ్య దేశం. అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ప్రజాస్వామ్య యుతంగా ఏర్పడ్డాయి.

మరి ఇలాంటి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యులు అయిన నేతలకు నిజంగానే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోయినా.. దానిపై నమ్మకం ఉన్నట్టుగానైనా నటించాలి. అయితే ఈ మాత్రం నటించడం కూడా ఇష్టం లేనట్టుగా ఉంది రేవంత్ రెడ్డికి. ప్రత్యేకించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తే సమయంలో రేవంత్ రెడ్డి అన్నీ మరిచిపోయి మాట్లాడుతున్నాడు.

తాజాగా ఆయన ఏమి అన్నాడంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పదవి నుంచి దించేస్తానని ప్రతిన బూనాడు. మరి ముఖ్యమంత్రిని దించడం అంటే… అదేమీ పెట్టిదంచడం కాదు కదా! కేసీఆర్ వెనక మెజారీ సభ్యులున్న ఒక పార్టీ… అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అలాంటి బలంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని దించడం అంటే.. ప్రజాస్వామ్యయుతంగా ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. అయితే రేవంత్ మాత్రం కేసీఆర్ ను ఒంటిచేత్తో దించేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు.

దించేస్తానని అంటున్నాడు. అయినా రేవంత్ ఇప్పటికే చాలా వరకూ నష్టపోయాడు. ఎమ్మెల్యేలను కొనబోయి ఇరుక్కొన్నాడు. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి ప్రమాదం లేనట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇది ఎప్పటికి ఎలాంటి మలుపు అయినా తీసుకొనే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. మరి ఇప్పటికీ ఆయన కేసీఆర్ ను దించేస్తా..పొడిచేస్తా.. అనడం మాత్రం విడ్డూరమైన అంశమే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -