Monday, May 20, 2024
- Advertisement -

నేడు ఆగస్ట్ 29 తెలుగు భాష దినోత్సవం

- Advertisement -

దేశభాషలందు తెలుగు లెస్స  అంటూ శ్రీ కృష్ణ దేవరాయల ప్రశంసలందుకున్న  భాష మనది.  3వేల సంవత్సరాల చరిత్ర.   2వేల ఏళ్ల వైభవం 15 వందల సంవత్సరాల సాహిత్య పరంపర ఉన్న ఈ ఆధునిక యుగం లో తెలుగు వెలగ లేకపోతున్నది.

 మద్రాస్ లాంటి హైకోర్ట్  తెలుగు భాష ప్రాచీన హోదాగలది, అని చెప్పినా  ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తన అనవాళ్లు అని వెతికె పరిస్ధితి  లేదు ఎందుకంటే ఇంగ్లీష్ రాజ్య మేలుతున్నది.  పరాయి భాషల దాడిలో తెలుగు కనుమరుగు అవుతున్నది. 

తెలుగు భాష గొప్పదనం,తెలుగు భాష తీయదనం తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం అన్నారు ఓకవి. దేశభాషలందు తెలుగులెస్స అని పలికాడు శ్రీకృష్ణ దేవరాయల వారు, పంచదారలకన్న పనసతొనల కన్న  కమ్మని తేనె కన్న తెలుగు మిన్న అన్నారు మరో కవి. ఇలా ఎందరో మహనీయులు తెలుగు భాష ప్రాముఖ్యతను,విశిష్టతను గురించి ప్రపంచానికి చాటి చెప్పారు. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే భాషగా తెలుగుకు 13 వస్థానం ఉంది. ఇంతటి ఘన చరిత కలిగిన మన తెలుగు భాషకు నేడు అవమానం జరిగింది. మన వాళ్లు చేసిన పనికి తెలుగు తల్లి తల్లడిల్లింది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ,మాకన్న తల్లికి మంగళారతులు అని పాడుకోవడానికి కనీసం ఎవ్వరికీ నోరు రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ నిత్యం తెలుగు వెలుగులో బతికే మన పాలకులు తెలుగు తల్లికి అవమానం చేశారు. ఇక నిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగువారి కోసం ,తెలుగు వారి మనస్సాక్షి అనే చెప్పుకునే అన్ని మీడియా ఛానళ్లు సైతం తెలుగు తల్లిని మరచిపోయాయి.

ఇక విషయానికి వస్తే నేడు తెలుగుభాషా దినోత్సవం. తెలుగు ప్రజల పండుగ..కాని ఆ పండుగను మరిచిపోయారు,,దీనికి ప్రతి తెలుగు కుటుంబం తలదించుకోవాల్సిన పరిస్థితి. ప్రజలను పక్కన పెట్టండి ,మరి ప్రభుత్వాలకూ,మీడియాకు ఏమైందీ.. ఇది క్షమించరాని నేరం..తెలుగు తల్లికి జరిగిన అవమానం.. తెలుగు భాషా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోవాల్సిన అధికార పార్టీలు,తెలుగు మీడియా ఎందుకు విస్మరించింది.

ఒక ప్రక్కన తెలుగు తేజాలు ప్రపంచస్థాయిలో మన గౌరవాన్ని కాపాడుతుంటే..మన సొంతగడ్డపైన మనవాళ్లకు ఏమైంది.. అమ్మా తెలుగు తల్లి..నీవు పెట్టే ముద్దతిని నిన్నే మరిచిపోయారమ్మ నీ కన్నబిడ్డలు..అయినా తప్పు వాళ్లది కాదులే..ఆధునిక పోకడలకు పోయి మన సంస్కృతి సంప్రదాయాలు మరిచి ఇలా నిన్ను విస్మరించిన వీళ్లను క్షమించు తల్లీ..

***తెలుగు బిడ్డలకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు***

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -