ఏప్రిల్‏లో సినీ ప్రియులకు పండగే.. !

- Advertisement -

కరోనా సంక్షోభం నేప‌థ్యంలో డీలా ప‌డిన సినీ ప‌రిశ్ర‌మ ఇప్పుడిప్పుడే మళ్లీ ప‌రుగులు పెడుతోంది. ఇటీవ‌ల థియేట‌ర్లు తిరిగి ఓపెన్ కావ‌డంతో ప్రేక్ష‌కుల‌తో సంద‌డి చేస్తున్నాయి. ఇక ఈ నెల‌లో (ఏప్రిల్‌)లో సినీ ప్రియుల‌కు పండ‌గ‌నే చెప్పాలి. ఎందుకంటే ఈ నెల‌లో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో పాటు చిన్న సినిమాలు సైతం భారీగానే విడుద‌ల కాబోతున్నాయి.

వాటిలో ప‌లు చిత్రాల‌పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. అందులో ఏఏ చిత్రాలు ఉన్నాయో ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఏప్రిల్ 2న టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగ్ న‌టించిన “వైల్డ్ డాగ్” ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇదే రోజు స్టార్ హీరో కార్తీ న‌టించిన “సూల్తాన్” కూడా విడుద‌ల‌వుతోంది. అలాగే, హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన “సీటిమార్” మూవీ కూడా శుక్ర‌వార‌మే విడుద‌ల కాబోతోంది.

- Advertisement -

ఇక చాలం కాలం నుంచి ప‌వ‌న్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి పండ‌గే. ఎందుకంటే ఈ నెల 9న ప‌వ‌న్ న‌టించిన “వ‌కీల్ సాబ్” థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. నాగచైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌టించిన “ల‌వ్ స్టోరీ” సినిమా ఈ నెల 16న విడుద‌ల కానుంది. స‌త్య‌దేవ్-త‌మ‌న్న‌ల “గుర్తుందా శీత‌కాలం” 14న విడుదల కానుంది. నేచురల్ స్టార్ నాని న‌టించిన “టక్ జగదీష్” సినిమా ఏప్రిల్ 23న విడుదల కానుంది. చూడాలి మ‌రి ఏ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసి… ప్రేక్ష‌కులను అల‌రిస్తుందో… !

కార్తీ ‘ఖైదీ’ సీక్వెల్ రాబోతోంది !

మీ దంతాలు పసుపురంగులో ఉంటే.. ఈ చిట్కాలు మీ కోసం !

‘వీరయ్య’గా.. చిరు విశ్వరూపం !

సాగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థి ఆయనే..

రంగుల కేళీ.. సంబురాల హోలీ !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -