Wednesday, May 15, 2024
- Advertisement -

బ‌డ్జెట్‌ను చూసి ప‌వ‌న్ అజ్ణాతంలోకి …?

- Advertisement -

ప్రశ్నించటానికే పుట్టందంటూ జనసేన గురించి చెప్పుకునే పవన్ ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు. బ‌డ్జెట్‌లో ఏపీకీ కేటాయించిన కేటాయింపుల‌ను చూసి అజ్ణాతంలోకి వెళ్లాడా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఎప్పుడూ ఆవేశంగా ఊగిపోయో ప‌వ‌న్ బ‌డ్జెట్‌పై మాత్రం నోరు పెగ‌ట‌గంలేదు.

అస‌లు జ‌న‌సేన అధ్య‌క్షుడు ఎక్క‌డున్నాడు..? అర్ధంకాని వీరావేశంతో సంబంధం లేని డైలాగులతో జనాలను కన్ఫ్యూజ్ చేసే పవన్ బడ్జెట్ పై ఏమీ మాట్లాడటం లేదే? ఉభయ తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేసిన సంగతి అందరకీ తెలిసిందే. నేను రంగంలోకి దిగితే వేరేవిధంగా ఉటుంద‌నే ప‌వ‌న్ క‌నీసం బ‌డ్జెట్‌పై స్పందించ‌డంలేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇటువంటి నేపధ్యంలో ప్రశ్నించటానికే పుట్టందంటూ జనసేన గురించి చెప్పుకునే పవన్ మాత్రం ఎక్కడా అడ్రస్ లేకపోవటమే ఆశ్చర్యం. చాలా కాలంగా ఏదో ఓ కారణంతో కేంద్రంపై పవన్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. రేపటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తులుంటాయో లేదో తెలీదు. కానీ ఇపుడు ఏపికి అన్యాయం జరిగిందన్నది మాత్రం వాస్తవం.

మరి ఆ అవకాశాన్ని పవన్ ఎందుకు ఉపయోగించుకోవటం లేదు? ప్రత్యేకహోదా లేదు. ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదు. రాజధాని, పోలవరంకు నిధుల సంగతి గోవిందా. రాష్ట్రప్రయోజనాలు, విభజన చట్టం అమలు లాంటవన్నీ గాలికికొట్టుకు పోయాయి. ఈ బ‌డ్జెట్‌లో ఏపీకీ పంగ‌నామాలు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

మిత్ర‌ప‌క్షం లేద‌న‌కుండా అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇక వైసిపి అయితే రాష్ట్రంలోని పలుచోట్ల ప్రత్యక్ష ఆందోళనకు దిగాయి. టిడిపి మంత్రులు, ఎంపిలు, నేతలు కూడా చంద్రబాబునాయుడుపై పొత్తులు వద్దంటూ ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో కేంద్రం ఏపికి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా పవన్ మాట్లాడకపోతే వచ్చే ఎన్నికల్లో జనసేనను జనాలు నమ్మరు.

జనసేన పార్టీలో మేధావి వర్గం (అంటూ వుంటే) బడ్జెట్ ను స్టడీ చేసి, జనసేనాధిపతికి బ్రీఫింగ్ ఇవ్వాలి. ఆయన ప్రకటన చేయాలి. కానీ దానివల్ల పలితం కన్నా, త్వరలో ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో పవన్ పర్యటనలు ప్లానింగ్ లో వున్నాయి. అక్కడ ఉపన్యాసాలకు ఈ బడ్జెట్ బాగా పనికి వస్తుంది. సరైన కంటెంట్ లేక అనంతపురం ఉపన్యాసాలు అజ్ఞాతవాసి సినిమా మాదిరిగా ఫెయిల్ అయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -