Saturday, May 4, 2024
- Advertisement -

ఆసియాగేమ్స్‌లో భార‌త్ పంచ్‌… బాక్సింగ్‌లో తొలిసారి భార‌త్‌కు స్వ‌ర్ణం….

- Advertisement -

ఏషియన్‌ గేమ్స్‌ 2018లో బాక్సింగ్‌లో భారత్‌ పంచ్‌ అదిరింది. భారత బాక్సర్ అమిత్ పంఘల్ పసిడి పతకం సాధించాడు. ఈ ఏషియాడ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత బాక్సర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్‌ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ విజేత దుస్మాతోవ్‌ హసన్‌బాయ్‌(ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు భారత్ ఖాతాలో 14 బంగారు పతకాలు చేరాయి. ఫైనల్లో చక్కటి ఆట తీరు కనబర్చిన అమిత్.. రియో ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన దుస్మటోవ్‌ను ఓడించడం విశేషం. పతకాల సంఖ్య 67కు చేరింది. దాంతో ఈ క్రీడల చరిత్రలోనే భారత్‌ అత్యధిక పతకాలను సాధించినట్లయ్యింది. 2010 గ్వాంగ్‌జూ ఏషియాడ్‌లో భారత్‌ అత్యధికంగా 65 పతకాలు సాధించగా… జకార్తా క్రీడల్లో ఆ రికార్డు కూడా తెరమరుగైంది. ఇప్పటివరకూ భారత్‌ 15 స్వర్ణ పతకాలు, 23 రజతాలు, 29 కాంస్యాలను సాధించింది.

ఆరంభం నుంచే ఆధిపత్యం కనబర్చిన అమిత్.. తొలి రెండు రౌండ్లను ఖాతాలో వేసుకున్నాడు. దూకుడుగా ఆడే హసన్‌బాయ్‌ను అదే మంత్రంతో మట్టికరిపించాడు. అమిత్ చివర్లో కాస్త తడబడ్డాడు.. కానీ అప్పటికే మ్యాచ్ ఫలితం అతడి వైపు వైపు మొగ్గు చూపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -