Sunday, May 5, 2024
- Advertisement -

నాలుగో టెస్ట్‌లో భార‌త్ 273 కు ఆలౌట్‌…37 ప‌రుగుల ఆధిక్యం

- Advertisement -

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్‌ మరోసారి తడబాటుకు గురయ్యారు. ఓపెన‌ర్లు మ‌రో సారి విఫ‌లం అయ్యారు. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకి ఆలౌటైంది. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం 19/0తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర్ పుజారా (132 నాటౌట్: 257 బంతుల్లో 16×4) అజేయ శతకం‌తో ఆతిథ్య జట్టుకి గట్టి పోటీనిచ్చాడు.

జట్టు స్కోర్‌ 142 వద్ద కోహ్లి అవుట్‌ కాగా.. మిగతా బ్యాట్స్‌మెన్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 84.5ఓవర్లలో 273పరుగులకే చాప చుట్టేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ ఐదు వికెట్లు పడగొట్టగా, ఫాస్ట్‌ బౌలర్‌ బ్రాడ్‌ మూడు వికెట్లు తీశాడు.

తొలిరోజు ఇంగ్లాండ్ 246 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైన నేపథ్యంలో.. భారత్ జట్టుకి 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత్ ఆలౌట్ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి 6/0తో నిలిచింది. క్రీజులో ఓపెనర్లు అలిస్టర్ కుక్ (2), జెన్నింగ్స్ (4) ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 21 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటుతో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -