Friday, May 17, 2024
- Advertisement -

ప్రజల కోసమే జగన్..

- Advertisement -

ప్రజలకు ఇష్టంలేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోమని ఎప్పుడో చెప్పాం..మళ్లీ ఇప్పుడు అదే మాట చెబుతున్నాము… ఆ చట్టం ఆంధ్రాలో అమలు చేసేది లేదు అన్నారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అసలు భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని రాష్ట్రాలపై బీజేపీ సారధ్యంలోని కేంద్రం ఒత్తిడి చేస్తూనే ఉంది…ఇప్పుడు అదే బీజేపీతో టీడీపీ జట్టుకట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద టీడీపీ నాయకులూ వక్రభాష్యాలు చెప్తున్నారని మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా ఆ దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తాం..అసలు ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు అన్నారు.ఇక మా ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశాం..సమగ్ర భూ సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోంది.. అత్యాధునిక టెక్నాలజీని సర్వేకోసం వినియోగించాం అన్నారు.గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుంది, ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరుగుతుంది. ఇవన్నీ తెలిసికూడా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.

26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్కాదా?,అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా? ఆలోచించాలన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా?,చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్… మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా?,31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా?,రాష్ట్రంలో ప్రజలంతా అమయాకులని అనుకుంటున్నారా? ఆలోచించాలన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు అనుకూల నిర్ణయలు తప్ప, ఒక్క వ్యతిరేక నిర్ణయాన్నీ తీసుకోలేదు,దొంగరాతలు, తప్పుడు ప్రచారాలు మానండి..మళ్ళీ చెబుతున్నాం…. ఈ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అమలు చేయడం లేదు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -