Monday, May 20, 2024
- Advertisement -

టీమిండియా మ్యాచ్‌లంటేనే వ‌ణికిపోతున్న భీమా కంపెనీలు…

- Advertisement -

క్రికెట్‌లో టీమిండియా జట్టులేక‌పోతె ఐసీసీకీ భారీగా ఆదాయం త‌గ్గిపోతుంది. ఒక వేల చెప్పాలంటే టీమిండియాతో క్రికెట్ బ్ర‌తుకుతోంది. ఐసీసీకీ వ‌చ్చే ఆదాయంలో 80 శాతం బీసీసీఐ ద్వారానె వ‌స్తోంది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు భార‌త్‌. అయితే ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను వ‌ర‌ణ‌దేవుడు వ‌ణికిస్తున్నాడు. మ్యాచ్‌లు ర‌ద్దు అయితే వంద‌ల కోట్లు న‌ష్టాపోవాల్సింది ప్ర‌సార హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న బ్రాడ్‌కాస్టర్స్‌కు న‌ష్టం వ‌స్తోంది. దీని వ‌ల్ల ఐసీసీకీ వ‌చ్చే ఆదాయంపై కూడా త‌గ్గిపోతుంది.

ఐసీసీ వరల్డ్ కప్‌ 2019 భాగంగా జరుగుతోన్న మ్యాచ్‌లకు అప్పుడప్పుడు వరుణుడు అడ్డంకులు క‌లిగిస్తున్నారు. మ్యాచ్‌లు అడ్డుకోవద్దు అంటూ ప్రతీ క్రికెట్ ప్రేక్షకుడు వ‌రుణిడిని వేడుకుంటుండగా… ఇప్పుడు ఫ్యాన్స్‌తో పాటు బీమా సంస్థలు కూడా వరుణుడికి దండంపెడుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా మ్యాచ్‌లు ఆగకుండా చూడు స్వామీ అంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాయి.

ఇదంతా ఎందుక‌నుకుంటున్నారా….? మార్కెటింగ్ పరంగా టీమిండియాను కొట్టే జట్టు మరొకటి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టీమిండియా మ్యాచ్ నిర్వహించినా కాసుల వర్షం కురుస్తుంది. దాంతో వాణిజ్య ప్రకటనల టారిఫ్ కూడా ఆకాశాన్నంటుంది. ఇక వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచ్ లంటే చెప్పేదేముంది? ఒక్కో మ్యాచ్ కు రూ.50 కోట్ల వరకు గరిష్టంగా ఆదాయం వచ్చిపడుతుంది. భారత జట్టు ఆడే మ్యాచ్ లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రసారకర్తలు ముందుగానే కవరింగ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు.

మ్యాచ్‌లు రద్దు అయితే.. రూ.100 కోట్ల వరకు నష్టం వాటిళ్లనుంది. సెమీ ఫైనల్స్‌కు ముందు భారత జట్టు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షార్పణంకావటంతో బీమా కంపెనీలు తలపట్టుకున్నాయి. రానున్న రోజుల్లో జరిగే మ్యాచ్‌లు వర్షం కారణంగా నిలిచిపోతే రూ.100 కోట్లు చెల్లించక తప్పని పరిస్థితి.ఉత్తిపుణ్యానే వందకోట్లంటే ఎవరికైనా కష్టమే! అందుకే పేరుమోసిన బీమా సంస్థలు సైతం వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచ్ లో వర్షం అంటే హడలిపోతున్నాయి. వర్షం రాకూడదనే కోరుకుంటున్నాయి. అంద‌రి విన్న‌పాన్ని వ‌ర‌ణుడి క‌రునిస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -