టీమిండియా వెనక్కి తగ్గదు..!

- Advertisement -

సౌతాఫ్రికా తో జరుగుతున్నా అయిదు టి20 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలో భారత్ ఘోరంగా విఫలం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలోనూ , కెప్టెన్సీ విభాగంలోనూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది పంత్ సేన. అయితే ఎట్టకేలకు విమర్శలకు చెక్ పెడుతూ మూడవ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ లోనూ, అటు బౌలింగ్ లోనూ చక్కటి ప్రదర్శన కనబరిచి సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే టీమిండియా స్వదేశంలో జరిగే మ్యాచ్ లలో అంతా తేలిగ్గా ఓటమిని అంగీకరించదని,కాస్త లేటైన వెంటనే పుంజుకొని ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించేందుకే ప్రయత్నిస్తుందని ఇంజుమమ్ ఉల్ హక్ అన్నాడు..

అంతే కాకుండా సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కే‌ఎల్ రాహుల్ వంటి వారు లేకున్నా భారత యువ జట్టు అద్బుతంగా రానిస్తోందంటూ ఇంజుమమ్ ప్రశంశలు కురిపించాడు. అయితే యువ జట్టు ఇంత అద్బుతంగా రాణించడానికి కారణం డ్రస్సింగ్ రూమ్ లో ద్రావిడ్ చేసే సూచనలే ప్రదాన కారణం..ద్రావిడ్ కు యువ జట్టు నుంచి అద్బుతమైన ప్రదర్శన ఎలా రాబట్టుకోవాలో చాలా బాగా తెలుసని ఇంజుమమ్ అన్నాడు. ఇదిలా ఉండగా మొదటి రెండు మ్యాచ్ లలో రిషబ్ పంత్ కెప్టెన్సీ పై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే మూడవ మ్యాచ్ లో అతడి కెప్టెన్సీ మెరుగ్గానే కనిపించింది.

- Advertisement -

బౌలింగ్ ఆర్డర్ మార్చడంలో అతడు లోపాలను సవరించుకొని ముందుకు సాగుతున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ నెల 19న జరిగే మూడవ టి20 మ్యాచ్ ఇరు జట్లకు కూడా కిలకంగా మారానుంది. ఇప్పటికే రెండు విజయాలతో జోరుమీదున్న సౌతాఫ్రికా మూడవ విజయాన్ని ఖాతాలో వేసుకొని సిరీస్ ను ఎగరేసుకుపోవాలని చూస్తుంటే.. గత మ్యాచ్ ఇచ్చిన జోష్ తో మరో మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. మరి ఏ జట్టు ఆధిపత్యాన్ని కనబరుస్తుందో తెలియాలి అంటే 19వ తేదీ వరకు ఎదురు చూడక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -