Wednesday, May 15, 2024
- Advertisement -

విండీస్ నడ్డి విరిచిన ఇషాంత్..మొదటి టెస్ట్ పై పట్టు బిగించిన భారత్

- Advertisement -

అంటిగ్వాలో జరుగుతున్న మొదటి టెస్ట్ లో టీమిండియా తన సత్తా చాటింది. తన పదునైన బౌలింగ్ తో విండీస్ కుఇషాంత్ చుక్కలు చూపించారు. ఈ టెస్ట్ లో ఇషాంత్ త‌న ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు.ఫలితంగా వెస్టిండీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 59 ఓవర్లలో 189 పరుగులే చేసిన విండీస్‌ ఎనిమిది వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా 108 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. విండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌ పూర్తి కావడానికి రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో భారత్‌కు మ్యాచ్‌పై పట్టుదొరికినట్లే

ఇశాంత్ 42 ర‌న్స్ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, ష‌మీ, జ‌డేజాలు చెరో వికెట్ తీసుకున్నారు. వెస్టిండీస్‌లో చేజ్ ఒక్క‌డే అత్య‌ధికంగా 48 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు.వాస్త‌వానికి బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉన్నా.. ఇశాంత మాత్రం విండీస్ టాపార్డ‌ర్‌ను కుప్ప‌కూల్చాడు.

విండీస్‌ ఆటగాళ్లలో రోస్టన్‌ ఛేజ్‌(48), హెట్‌మెయిర్‌(35)లు మాత్రమే మోస్తరుగా రాణించారు. తొలుత ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ను పెవిలియన్‌కు పంపిన ఇషాంత్‌.. ఆపై మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. రోస్టన్‌ ఛేజ్‌, షాయ్‌ హోప్‌, హెట్‌ మెయిర్‌ వికెట్లను సాధించి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మొదటి ఇన్నీంగ్స్ లో 97 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ లో రహానే 81 పరుగులు చేయగా, లోయరార్డర్ లో వచ్చిన రవీంద్ర జడేజా 58 పరుగులతో రాణించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 44, విహారి 32, పంత్ 24 పరుగులు సాధించారు.

203/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ ను కీమార్ రోచ్ మరోసారి దెబ్బకొట్టాడు. పంత్ ను అవుట్ చేసి భారత పతనానికి శ్రీకారం చుట్టాడు. విండీస్ బౌలర్లలో రోచ్ 4, గాబ్రియెల్ 3 వికెట్లు తీశారు. స్పిన్నర్ రోస్టన్ చేజ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -