Monday, April 29, 2024
- Advertisement -

రసవత్తరంగా రాజ్‌కోట్ టెస్ట్!

- Advertisement -

రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 131 , రవీంద్ర జడేజా 112, సర్ఫరాజ్ ఖాన్ 62 , రవిచంద్రన్ అశ్విన్ (37), ధృవ్ జూరెల్ (46) పరుగులు చేశారు.

ఇక ఆ తర్ఆత ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డెక్కన్ 133 పరుగులతో నాటౌట్‌గా నిలవగా ఇవాళ కూడా ధాటిగా ఆడితే టెస్ట్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

ఇక ఈ టెస్టులో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల అశ్విన్ మ్యాచ్ వదిలినట్లు బీసీసీఐ ప్రకటించింది. తాజాగా 500 వికెట్లు తీసిన టీమిండియా రెండో బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ గైర్హాజరీతో టీమిండియాకు బౌలింగ్ విభాగంలో పెను సవాల్ ఎదురు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -